Hyundai Creta EV Launched: క్రెటా ఈవీ రానే వచ్చింది.. ఫీచర్స్ అదిరిపోయాయ్
Hyundai Creta EV was officially launched at the Auto Expo 2025 at the price of Rs. 17.99 lakh
Hyundai Creta EV Launched: కార్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హ్యుందాయ్ క్రెటా EVని ఆటో ఎక్స్‌పో 2025లో అధికారికంగా విడుదల చేసింది. దీన్ని క్రెటా ఫ్యూయల్ కారు ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఆ సెగ్మెంట్‌లో మారుతి ఇ విటారా, టాటా కర్వ్ ఈవీ వంటి వాటితో ఈ కారు పోటీ పడనుంది. కొత్త హ్యుందాయ్ క్రెటా EV ధర రూ. 17.99 లక్షలుగా నిర్ణయించారు.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు 42KWh, 51.4kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో అందించారు. ఇది 42KWh బ్యాటరీ ప్యాక్‌తో ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, స్మార్ట్(O), ప్రీమియం అనే నాలుగు వేరియంట్‌లను కలిగి ఉంది. అలాగే 51.4kWh బ్యాటరీ ప్యాక్ స్మార్ట్(O), ఎక్స్‌లెన్స్ వేరియంట్లలోనూ అందుబాటులో ఉంది.
ఇండియాలో క్రెటా EV ధర రూ. 17.99 లక్షల నుంచి రూ.23.49 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా EV చాలా కొత్త ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ, ఎక్స్‌టీరియర్ డిజైన్ ఆ ఇంధనంతో నడిచే క్రెటా కారును పోలి ఉంటుంది. ఇంటీరియర్‌లో, స్విచ్ గేర్, డాష్ బోర్డ్‌తో సహా కొన్ని పార్ట్స్ క్రెటా వలె ఉంటాయి. ఇది కాకుండా డిజైన్‌లో కొన్ని చిన్న మార్పులు చేశారు.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ లోపలి భాగంలో ట్విన్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్స్ ఉన్నాయి. ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ కోసం. రెండు స్క్రీన్‌లు చాలా పెద్దవి. వీటిని ఉపయోగించడానికి చాలా సులభం. అలాగే, కారు మూడు మ్యాట్ కలర్స్‌తో సహా 10 కలర్ ఆప్షన్స్‌లో కనిపిస్తుంది.
హ్యూందాయ్ క్రెటా EV ఫీచర్స్
వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), చైల్డ్ సీట్ యాంకర్ (ISOFIX), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), హిల్ డిసెంట్ కంట్రోల్‌తో సహా 19 ఫీచర్లతో LEVEL-2 ADAS సెటప్ కూడా ఉంది.
సౌండ్ సిస్టమ్, యూఎస్‌బి A, C పోర్ట్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆటో కార్ ప్లే కోసం డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, బోస్ నుండి 8-స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, 12V ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ప్యాక్‌లు ఫ్రంట్ యాక్సిల్‌కి లింక్ చేసిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో ఉంటుంది. ఇందులో 42KWh, 51.4kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే చిన్న బ్యాటరీ ప్యాక్ 390 కిమీ రేంజ్, పెద్ద బ్యాటరీ ప్యాక్ MIDC టెస్టింగ్‌లో 473 కిమీ రేంజ్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. పెద్ద 51.2kWh బ్యాటరీ ప్యాక్‌తో 169Bhp రిలీజ్ చేస్తుంది. ఇది 7.9 సెకన్లలో 0-100కిమీ వేగాన్ని అందుకుంటుంది. క్రెటా బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 58 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని హ్యుందాయ్ కంపెనీ చెప్పింది.