Hybrid Cars: హైబ్రిడ్ కార్ల జోరు.. త్వరలో మార్కెట్లోకి ఐదు కొత్త మోడల్స్..!
Hybrid Cars: భారత్‌లో కస్టమర్లు కారు మైలేజీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. దేశంలో హైబ్రిడ్ కార్ల ప్రజాదరణ వేగంగా పెరగడానికి ఇదే కారణం.
Hybrid Cars: హైబ్రిడ్ కార్ల జోరు.. త్వరలో మార్కెట్లోకి ఐదు కొత్త మోడల్స్..!
Hybrid Cars: భారత్‌లో కస్టమర్లు కారు మైలేజీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. దేశంలో హైబ్రిడ్ కార్ల ప్రజాదరణ వేగంగా పెరగడానికి ఇదే కారణం. హైబ్రిడ్ టెక్నాలజీ ఇంధన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైనంగా ఉంటుంది. పెరుగుతున్న ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని పలు కార్ల తయారీ కంపెనీలు భారత మార్కెట్లో హైబ్రిడ్ ఎస్‌యూవీలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథంలో త్వరలో విడుదల కానున్న 5 హైబ్రిడ్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Hyundai Creta Hybrid
దేశంలో అత్యధికంగా ఇష్టపడే హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు హైబ్రిడ్ వెర్షన్‌లో రాబోతోంది. కంపెనీ 2027 నాటికి కొత్త తరం మోడల్ SX3ని విడుదల చేయనుంది. ప్రస్తుతం క్రెటా పెట్రోల్, టర్బో-పెట్రోల్, టర్బో-డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అయితే హైబ్రిడ్ టెక్నాలజీనితో మైలేజ్, పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటాయి.
Kia Seltos Hybrid
కియా మోటార్స్ తన పాపులర్ సెల్టోస్ ఎస్‌యూవీని హైబ్రిడ్ టెక్నాలజీతో సన్నద్ధం చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. తదుపరి తరం సెల్టోస్ హైబ్రిడ్ బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఈ పవర్ ఫుల్ ఎస్‌యూవీని 2027లో విడుదల చేయచ్చు.
Toyota Urban Cruiser Highrider
టయోటా ఫేమస్ అర్బన్ క్రూయిజర్ హైబ్రిడ్ ప్రస్తుతం 5-సీటర్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. అయితే కంపెనీ తన 7-సీటర్ హైబ్రిడ్ మోడల్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఈ కొత్త ఎస్‌యూవీలో 177.6-వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ హైబ్రిడ్ 2026 చివరి నాటికి భారతీయ మార్కెట్లోకి విడుదల అవుతుందని భావిస్తున్నారు.
Maruti Suzuki Grand Vitara
మారుతి సుజుకి తన ప్రముఖ గ్రాండ్ విటారాలో 7-సీటర్ హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం విటారా 5-సీటర్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది, అయితే ఇప్పుడు కంపెనీ విటారాను కొత్త తరం హైబ్రిడ్ టెక్నాలజీతో తీసుకురానుంది.
Maruti Suzuki Franks Hybrid
మారుతి సుజుకి నుండి మరో గొప్ప హైబ్రిడ్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ హైబ్రిడ్ కూడా త్వరలో విడుదల కానుంది. ఇటీవల ఫ్రాంక్స్ టెస్టింగ్ మోడల్‌లో "హైబ్రిడ్" బ్యాడ్జ్ కనిపించింది. ఈ ఎస్‌యూవీ 2025 చివరి నాటికి మార్కెట్లోకి రావచ్చు.