Car Driving in Mountains: పర్వతాలపై డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ముఖ్య విషయాలను గుర్తుంచుకోండి, లేదంటే పెను ప్రమాదం జరగవచ్చు
How to Drive on Mountain Roads: పర్వతాలపై కారు డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి, పర్వతాలపై డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ముఖ్య విషయాలను గుర్తుంచుకోండి.
Car Driving in Mountains: పర్వతాలపై డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ముఖ్య విషయాలను గుర్తుంచుకోండి, లేదంటే పెను ప్రమాదం జరగవచ్చు
How to Drive on Mountain Roads: మనం ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసేటప్పుడు ముందుగా ఏ వాహనంలో ప్రయాణం చేస్తే మంచిది అనే విషయంపై ఆలోచిస్తాము. దాని గురించి చాలా చర్చలు చేస్తాం. ఎందుకంటే, కొంతమంది బస్సులో ప్రయాణించడానికి ఇష్టపడతారు, మరికొందరు రైలులో ప్రయాణించాలని కోరుకుంటారు. అలా కాకుండా ఇంకొంత మంది విమానంలో ప్రయాణిస్తే బాగుంటుందని అనుకుంటారు. కానీ, ఫ్యామిలీ ట్రిప్ విషయానికి వస్తే చాలా మంది కారులో ప్రయాణించడానికే ఇష్టపడతారు. ఎందుకంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ కారు ఆపుకుని హ్యాపీగా నచ్చిన ప్లేస్‌లు చూడవచ్చు. ఇలా కారులో వెళ్లడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది ఎక్కువగా పర్వత ప్రాంతాలను చూసేందుకు ఆసక్తి చూపుతారు. అది కూడా సొంత కారులో వెళ్లడానికి ఇష్టపడతారు. అయితే, మీరు పర్వతాలపై కారు డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి, పర్వతాలపై డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ముఖ్య విషయాలను గుర్తుంచుకోండి.
ఓవర్‌టేక్ చేయకండి
మనం నగరాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ముందుకు వెళ్లడానికి తరచుగా ఓవర్‌టేక్ చేస్తాము. కానీ, పర్వతాలపై డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఓవర్‌టేక్ చేయకూడదు. మీరు పర్వతాలలో ఓవర్‌టేక్ చేస్తే, ముందు నుండి వాహనం రావచ్చు. అలాంటి సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పర్వతాలపై ఓవర్‌టేక్ చేయకుండా ఉండండి.
వేగంగా నడపకండి
మీరు పర్వతాలపై కారు డ్రైవ్ చేసేటప్పుడు అతి వేగంగా నడపడం మంచిది కాదు. ఎందుకంటే పర్వతాలలోని రోడ్లు నగరాల మాదిరిగా నిటారుగా కాకుండా వంకరగా ఉంటాయి. కాబట్టి, కారు వేగాన్ని 30 నుండి 35 మధ్య నడపడం మంచిది. ఎట్టిపరిస్థితిలోనూ వాహనాన్ని అతి వేగంగా నడపకూడదు.
మలుపుల దగ్గర జాగ్రత్త
పర్వతాలపై డ్రైవింగ్ చేసేటప్పుడు మలుపుల దగ్గర జాగ్రత్తగా ఉండండి.పర్వతాలపై మలుపులు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి, మీరు ఒక మలుపు గుండా వెళుతుంటే ముందు నుండి వచ్చే వాహనం తెలుసుకునేలా హారన్ మోగించండి. మీరు రాత్రిపూట డీపర్‌ని ఉపయోగించవచ్చు.
వాతావరణం గురించి తెలుసుకోండి
పర్వతాలపై డ్రైవింగ్ చేసే ముందు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోని వెళ్లడం మంచిది. ఒకవేళ వాతావరణం అనుకూలంగా లేకుంటే డ్రైవింగ్ చేయడం సురక్షితం కాదు. భారీ వర్షం లేదా మంచు కురుస్తున్నట్లయితే మీరు పర్వతాలపై డ్రైవింగ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే కొండచరియలు విరిగిపడవచ్చు. కాబట్టి, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకున్న తర్వాతే పర్వతాలపై డ్రైవ్ చేయండి.