Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ పోతే ఏం చేయాలి? ఆర్డీఓతో పనిలేకుండా ఇంటికే రావాలంటే ఇలా చేయండి

Driving Licence  : డ్రైవింగ్ లైసెన్స్ పోతే ఏం చేయాలి?  ఆర్డీఓతో పనిలేకుండా ఇంటికే రావాలంటే ఇలా చేయండి
x

Driving Licence : డ్రైవింగ్ లైసెన్స్ పోతే ఏం చేయాలి? ఆర్డీఓతో పనిలేకుండా ఇంటికే రావాలంటే ఇలా చేయండి

Highlights

Driving Licence: అప్పుడప్పుడు మన ముఖ్యమైన కాగితాలు ఎక్కడో పడిపోతుంటాయి.

Driving Licence : అప్పుడప్పుడు మన ముఖ్యమైన కాగితాలు ఎక్కడో పడిపోతుంటాయి. అందులో డ్రైవింగ్ లైసెన్స్ (DL) పోతే ఇక అంతే సంగతులు అనుకుంటాం. కానీ భయపడాల్సిన పనిలేదు.. మీ డీఎల్ పోతే ఏం చేయాలో తెలిస్తే చాలా సులువుగా మళ్లీ తెచ్చుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు చేస్తే చాలు.. మీ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటి అడ్రస్‌కు వచ్చేస్తుంది! ఎలాగో ఈ కథనంలో చూద్దాం.

1. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వాలి

మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా, వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వండి. దానికో కాపీ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది భవిష్యత్తులో చాలా అవసరం అవుతుంది.

2. డూప్లికేట్ డీఎల్ కోసం అప్లై చేయండి (ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో):

మళ్లీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి మీరు ప్రభుత్వ రవాణా శాఖ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ 'డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్' అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి, 'అప్లై ఫర్ డూప్లికేట్ DL' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. తర్వాత మీ రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసుకొని మీ వివరాలన్నీ నింపేయండి.

3. కావాల్సిన కాగితాలు ఇవ్వండి:

మీరు కంప్లైంట్ ఇచ్చిన కాపీతో పాటు మీ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాగితాలన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత, గవర్నమెంట్ చెప్పినంత ఫీజు (రూ.200 నుండి రూ.500 వరకు ఉండొచ్చు) ఆన్‌లైన్‌లో కట్టేయండి.

4. ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లండి:

మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత, మీ దగ్గరలోని ఆర్టీఓ (RTO) ఆఫీస్‌కు వెళ్లి మీ ఒరిజినల్ కాగితాలు (కంప్లైంట్ కాపీ, ఐడీ ప్రూఫ్, ఫోటో) అక్కడ చూపించాలి. వాళ్లు అడిగిన వివరాలు ఇవ్వాలి.

5. మీ డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ అందుకోండి:

మీరు ఇచ్చిన కాగితాలన్నీ సరిగ్గా ఉంటే, వాళ్లు మీ డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపిస్తారు. లేదా కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తారు. అంతే! టెన్షన్ పడకుండా ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ డీఎల్ మళ్లీ మీ చేతిలో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories