Honda Scoopy 2025: ఈ సారి అదిరిపోయే లుక్, ఫీచర్లతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హోండా స్కూపీ
Honda Scoopy 2025: హోండా కంపెనీ మళ్ళీ తన రెట్రో, మోడర్న్ లుక్ ఉండే స్కూటర్ స్కూపీని ఇండియాలో పేటెంట్ చేయించుకుంది. ఇండియాలో స్కూపీ పేరు చర్చల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు.
Honda Scoopy 2025: ఈ సారి అదిరిపోయే లుక్, ఫీచర్లతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న హోండా స్కూపీ
Honda Scoopy 2025: హోండా కంపెనీ మళ్ళీ తన రెట్రో, మోడర్న్ లుక్ ఉండే స్కూటర్ స్కూపీని ఇండియాలో పేటెంట్ చేయించుకుంది. ఇండియాలో స్కూపీ పేరు చర్చల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. కానీ, ఈసారి దానికి పేటెంట్ వచ్చిందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అసలు ఈ స్కూటర్‌లో ఏముంది? ఇది మిగిలిన వాటికంటే ఎలా స్పెషల్ అవుతుందో తెలుసుకుందాం.
హోండా స్కూపీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాని రెట్రో లుక్ గురించే. ఇది పాత కాలపు స్కూటర్లను గుర్తు చేస్తుంది. కానీ, దీని స్టైల్‌తో పాటు, ఇందులో లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. స్కూపీలో క్రిస్టల్-బ్లాక్ ఎల్ఈడి హెడ్‌లైట్, గుండ్రటి టెయిల్ ల్యాంప్స్, డీ-షేప్ ఇండికేటర్లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. దీని బాడీ ప్యానెల్ చాలా నాజూకుగా ఉంటుంది. సీటు కూడా సింగిల్ పీస్, చాలా సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేశారు.
ఈ స్కూటర్‌లో 109.5cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది దాదాపు 9bhp పవర్, 9.2Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఇచ్చారు. దీని వల్ల ముఖ్యంగా సిటీలోని రద్దీ రోడ్లపై నడపడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. హోండా స్కూపీ పాత రోజులను గుర్తు చేసినా, దీని ఫీచర్స్ మాత్రం పూర్తిగా కొత్తవి. ఇందులో ఎల్సీడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ కీ, కీలెస్ స్టార్ట్, ఆల్ ఎల్ఈడి లైటింగ్, యాంటీ-థెఫ్ట్ అలారం ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అలాగే, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రేర్ మోనోషాక్ సస్పెన్షన్ కూడా ఉన్నాయి.
స్కూపీని ఇండియాలో పేటెంట్ చేసినప్పటికీ, దీన్ని ఇప్పుడే లాంచ్ చేస్తామని కంపెనీ ఇంకా అధికారికంగా చెప్పలేదు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, హోండా కేవలం దీని డిజైన్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి మాత్రమే పేటెంట్ చేసిందట. ఒకవేళ ఈ స్కూటర్ ఇండియాలో విడుదలైతే, అది యమహా ఫాసినో, సుజుకి యాక్సెస్, వెస్పా ఎస్ లాంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చు. మొత్తం మీద, హోండా స్కూపీ ఒక స్టైలిష్, స్మార్ట్, ప్రత్యేకమైన స్కూటర్. దీని కోసం భారత మార్కెట్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది.