Honda: 245 కి.మీ రేంజ్, 30 నిమిషాల్లో ఛార్జ్.. వస్తోంది హోండా అతి చిన్న ఎలక్ట్రిక్ కారు!
Honda: కార్ల తయారీ దిగ్గజం హోండా త్వరలో ఒక చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. దీనికి హోండా N-One e అనే పేరు పెట్టారు. ఇది కంపెనీకి చెందిన అతి చిన్న ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించనుంది.
Honda: 245 కి.మీ రేంజ్, 30 నిమిషాల్లో ఛార్జ్.. వస్తోంది హోండా అతి చిన్న ఎలక్ట్రిక్ కారు!
Honda: కార్ల తయారీ దిగ్గజం హోండా త్వరలో ఒక చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. దీనికి హోండా N-One e అనే పేరు పెట్టారు. ఇది కంపెనీకి చెందిన అతి చిన్న ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించనుంది. గతంలో 2025 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో దీని కాన్సెప్ట్ వెర్షన్‌ను చూపించారు. ఇప్పుడు విడుదల చేయబోయే మోడల్ రోజువారీ ఉపయోగాలకు అనుకూలంగా ఉంటుంది. హోండా ఈ కారును సెప్టెంబర్‌లో ముందుగా జపాన్‌లో ఆ తర్వాత యూకేలో కూడా లాంచ్ చేయనుంది.
ఈ కొత్త కారు గురించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు. కానీ, ఇది హోండా N-Van e ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ వల్ల, N-One e ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 245 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. N-Van e మోడల్‌కు 50 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనితో కేవలం 30 నిమిషాల్లోనే బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ N-One eలో కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు సుమారు 63 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగరంలో చిన్నపాటి ప్రయాణాలకు ఇది సరిపోతుంది.
హోండా N-One e క్యాబిన్ డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. డాష్‌బోర్డ్‌లో అవసరమైన కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్‌లు, ఒక రొటరీ డయల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కింద ఒక చిన్న షెల్ఫ్ ఉంటాయి. ఇందులో వెనుక సీట్లను 50:50 నిష్పత్తిలో మడతపెట్టుకునే ఫెసిలిటీ ఉంది. దీనివల్ల ఈ చిన్న కారులో అవసరమైనప్పుడు ఎక్కువ సామాను పెట్టుకోవచ్చు. ఈ కారులో ఒక ప్రత్యేక ఫీచర్ ఉంది.. Vehicle-to-Load (V2L). దీని సహాయంతో కారు బ్యాటరీ నుండి చిన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని పొడవు సుమారు 3,400 మి.మీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.