Honda : కొత్త బైక్ కొనాలనుకుంటే కాస్త ఆగండి.. మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే హోండా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో హోండా ఇప్పుడు తన పట్టును మరింత బిగించుకోవడానికి సిద్ధమైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈసారి హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కాకుండా, ఒక సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
Honda : కొత్త బైక్ కొనాలనుకుంటే కాస్త ఆగండి.. మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే హోండా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది
Honda : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో హోండా ఇప్పుడు తన పట్టును మరింత బిగించుకోవడానికి సిద్ధమైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈసారి హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కాకుండా, ఒక సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తూ హోండా రాబోయే బైక్‌కు సంబంధించిన కొన్ని టెస్టింగ్ దశలు, త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు సిగ్నల్స్ ఇచ్చింది.
సెప్టెంబర్ 2న తమ కొత్త ఎలక్ట్రిక్ బైక్ గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని హోండా ఇప్పటికే స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన టీజర్ వీడియోలో బైక్ డిజైన్‌ను పూర్తిగా చూపించనప్పటికీ, బైక్ నడుస్తున్నప్పుడు మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.. అయితే టీజర్‌ను చూస్తుంటే ఇది గతంలో EICMA మిలన్ మోటార్‌సైకిల్ షోలో ప్రదర్శించిన ఈవీ ఫన్ కాన్సెప్ట్ లాగే కనిపిస్తుంది. ఈ కొత్త బైక్ 50bhp పవర్‌ను ఉత్పత్తి చేయగలదని అంచనా.
ఈ బైక్‌లో చాలా అత్యాధునిక ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద డిజిటల్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు భాగంలో డీఆర్‌ఎల్, బార్-ఎండ్ మిర్రర్స్, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్, సింగిల్-సైడ్ స్వింగ్ ఆర్మ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో CCS2 ఛార్జింగ్ ఫీచర్ ఉంటుందని హోండా ఇప్పటికే కన్ఫాం చేసింది. దీని వల్ల ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.
హోండా ఇప్పటికే తమ మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ E-VOని ఆవిష్కరించింది. ఈ బైక్ 4.1kWh, 6.3kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. ఒకే ఛార్జ్‌తో 120 కి.మీ , 170 కి.మీల రేంజ్ ఇస్తుంది. ప్రస్తుతం, హోండా ఈ బైక్‌లను భారతదేశంలో విడుదల చేసే ప్లాన్లను ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే, కంపెనీ ప్రస్తుతానికి భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. అయితే, రాబోయే రోజుల్లో హోండా ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తుందని ఆశిస్తున్నారు.