Harley Davidson X440: బుకింగ్స్‌లో దుమ్మురేపిన హార్లే డేవిడ్‌సన్ బైక్.. ప్రత్యర్థి కంపెనీలకు షాకిస్తోన్న సేల్స్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Harley Davidson X440: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్, హార్లే-డేవిడ్‌సన్ ఎక్స్440 కోసం ఇప్పటివరకు మొత్తం 25,597 బుకింగ్‌లను అందుకున్నట్లు మంగళవారం తెలియజేసింది.
Harley Davidson X440: బుకింగ్స్‌లో దుమ్మురేపిన హార్లే డేవిడ్‌సన్ బైక్.. ప్రత్యర్థి కంపెనీలకు షాకిస్తోన్న సేల్స్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Harley Davidson X440: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్, హార్లే-డేవిడ్‌సన్ ఎక్స్440 కోసం ఇప్పటివరకు మొత్తం 25,597 బుకింగ్‌లను అందుకున్నట్లు మంగళవారం తెలియజేసింది. జులై 4న ప్రారంభమైన బుకింగ్‌లు ప్రస్తుతం క్లోజ్ చేసినట్లు సంస్థ తెలిసింది. రీ-బుకింగ్ తేదీని త్వరలో తెలియజేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
హీరో మోటోకార్ప్ సీఈఓ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ, “ఈ సెగ్మెంట్‌లో హీరో మోటోకార్ప్ ప్రవేశంపై కస్టమర్ విశ్వాసాన్ని చూడడం చాలా గొప్ప విషయం. ఇంకా సంతోషకరమైన విషయం ఏమిటంటే, మా బుకింగ్‌లలో ఎక్కువ భాగం టాప్ మోడల్‌ల కోసం. సరైన బ్రాండ్, సరైన మోడల్ కోసం కస్టమర్‌లు ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని ఇది స్పష్టంగా చూపిస్తుంది" అని తెలిపింది.
Harley-Davidson X440 మూడు వేరియంట్‌లలో ప్రవేశపెట్టారు. డెనిమ్, వివిడ్, ఎస్. 2023 సెప్టెంబర్‌లో హార్లే-డేవిడ్‌సన్ ఎక్స్440 ఉత్పత్తిని ప్రారంభిస్తామని, అక్టోబర్ నుంచి కస్టమర్లకు బైక్‌ను డెలివరీ చేయనున్నామని హీరో మోటోకార్ప్ తెలిపింది.
హార్లే-డేవిడ్‌సన్ ఇటీవల భారతీయ మార్కెట్లో సరికొత్త X440ని రూ. 2.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. అయితే ఇది ఒక ప్రత్యేక పరిచయ ధర ఆఫర్. ఇది ఇప్పుడు ముగిసింది. ఈ మోటార్‌సైకిల్‌లోని అన్ని వేరియంట్‌ల ధరలను కంపెనీ రూ.10,500 పెంచింది. కొత్త ధరలు 4 ఆగస్టు 2023 నుంచి అమలులోకి వచ్చాయి.
Harley Davidson X440 Harley Davidson X440 Denim కొత్త ధరలు..
ఇప్పుడు రూ. 2.40 లక్షలుగా మారింది. ఇది గతంలో రూ. 2.29 లక్షలుగా ఉంది.
Harley Davidson X440 Vivid ధర గతంలో రూ.2.49 లక్షలుగా ఉన్న ధర ఇప్పుడు రూ.2.60 లక్షలకు పెరిగింది.
Harley Davidson X440 S ధర ఇప్పుడు రూ. 2.80 లక్షలు, ఇది గతంలో రూ. 2.69 లక్షలుగా ఉంది.