Harley Davidson X440: అమేజింగ్ లుక్స్.. రాకింగ్ సౌండ్.. హార్లీ డేవిడ్సన్ నుంచి అత్యంత చౌకైన బైక్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Harley Davidson X440: హార్లే డేవిడ్సన్ సరికొత్త అవతార్‌తో త్వరలో భారతదేశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తన చవకైన బైక్ హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440ని జులై 3వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనుంది.
Harley Davidson X440: అమేజింగ్ లుక్స్.. రాకింగ్ సౌండ్.. హార్లీ డేవిడ్సన్ నుంచి అత్యంత చౌకైన బైక్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Harley Davidson X440: హార్లే డేవిడ్సన్ సరికొత్త అవతార్‌తో త్వరలో భారతదేశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తన చవకైన బైక్ హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440ని జులై 3వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ బైక్‌ను లాంచ్ చేయడానికి ముందే, కంపెనీ దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలను షేర్ చేసింది. ఇటీవలే ఈ బైక్ బుకింగ్ కూడా ప్రారంభించింది. ఈ స్పెషల్ బౌక్ సైలెన్సర్ నుంచి వచ్చే సౌండ్ తెరపైకి వచ్చింది. ఈ 440 సీసీ బైక్ సైలెన్సర్ నుంచి వచ్చే సౌండ్ కూడా చాలా స్పెషల్‌గా ఉందంట. ఈ బైక్‌ను కంపెనీ అధికారిక డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. దీని కోసం రూ. 25,000 బుకింగ్ అమౌంట్‌గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో హార్లీ అందిస్తున్న అత్యంత చౌకైన బైక్ ఇదే. రూ.2.5 లక్షల నుంచి 3 లక్షల మధ్య విక్రయానికి కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది. దీని డెలివరీ ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుందంట.
Harley Davidson X440 ఎలా ఉందంటే..
హార్లే-డేవిడ్సన్, హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో ఉత్పత్తి చేయబడిన మొదటి మోడల్ ఇదే కావడం గమనార్హం. బైక్ స్టైలింగ్ పనిని హార్లే-డేవిడ్సన్ చేయగా, ఇంజనీరింగ్, టెస్టింగ్ , మొత్తం అభివృద్ధిని హీరో మోటోకార్ప్ చేసింది. దృశ్యపరంగా, ఇది స్టైలిష్ బైక్ లాగా కనిపిస్తుంది. దీనిలో హార్లే DNA కనిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలైన ఫొటోస్ చూస్తుంటే.. 'హార్లీ-డేవిడ్సన్' అని రాసి ఉన్న ఈ బైక్‌లో కంపెనీ డే-టైమ్-రన్నింగ్ (డీఆర్‌ఎల్) లైట్లను ఉపయోగించినట్లు తెలిసింది.
బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లకు బదులుగా USD ఫోర్క్‌లు లభిస్తాయి. వెనుక భాగం మరింత సాంప్రదాయకంగా ఉంటుంది. బైక్ వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. బైక్‌కు రెండు చివరలలో బైబ్రే డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS కూడా ఉన్నాయి. ఇందులో, కంపెనీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని ఉపయోగిస్తోంది.
ఎర్గోనామిక్స్ గురించి మాట్లాడితే, క్రూయిజర్‌లో చూసే ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లు లేదా స్వెప్ట్ బ్యాక్ హ్యాండిల్‌బార్ లేకుండా అందించారు. బదులుగా, కంపెనీ ఈ బైక్‌లో మిడ్-సెట్ ఫుట్‌పెగ్‌లు, ఫ్లాట్ హ్యాండిల్‌బార్‌ను అందించింది. కానీ ఈ బైక్ లుక్ చాలా స్పోర్టీగా ఉంది.
పనితీరు:
Harley-Davidson X440కి ఆధునిక-రెట్రో రూపాన్ని అందించారు. కంపెనీ ఈ బైక్‌లో కొత్త 440 cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఇది 30-35 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేశారు. ఇది స్టాండర్డ్‌గా స్లిప్పర్ క్లచ్‌ని పొందుతుందని భావిస్తున్నారు.