Top 10 Hatchback Cars: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతోన్న 10 హ్యాచ్ బ్యాక్ కార్లు ఇవే.. లిస్టులో టాప్ ఏదంటే?

Top 10 Hatchback Cars: భారతీయ మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్ల విక్రయాలు జోరందుకున్నాయి. సెడాన్ కార్లు మార్కెట్ నుంచి కనుమరుగవుతున్నాయి.

Update: 2023-08-14 14:15 GMT

Top 10 Hatchback Cars: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతోన్న 10 హ్యాచ్ బ్యాక్ కార్లు ఇవే.. లిస్టులో టాప్ ఏదంటే?

Top 10 Hatchback Car Sales In July 2023: భారతీయ మార్కెట్‌లో SUV కార్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. సెడాన్ కార్లు మార్కెట్ నుంచి కనుమరుగవుతున్నాయి. అయినప్పటికీ, హ్యాచ్‌బ్యాక్‌లు, చిన్న కార్ల మార్కెట్ దాని స్థానంలో ఉంది. దీనికి చాలా కారణాలున్నాయి. కాగా, జులై (2023) నెలలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం. మారుతి సుజుకి స్విఫ్ట్ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది.

అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కార్లు (జులై 2023)..

Maruti Suzuki Swift: మారుతీ సుజుకి స్విఫ్ట్ జులై 2023లో 17,896 యూనిట్లను విక్రయించగా, జులై 2022లో 17,539 యూనిట్లు విక్రయించబడ్డాయి. అంటే, వార్షిక ప్రాతిపదికన దాని అమ్మకాల్లో 2% జంప్ ఉంది.

Maruti Suzuki Baleno : మారుతి సుజుకి బాలెనో జులై 2023లో 16,725 యూనిట్లను విక్రయించగా, జులై 2022లో 17,960 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, వార్షిక ప్రాతిపదికన దాని అమ్మకాల్లో 7% క్షీణత ఉంది.

Maruti Suzuki Wagon R: మారుతీ సుజుకి వ్యాగన్ ఆర్ జులై 2023లో 12,970 యూనిట్లను విక్రయించగా, జులై 2022లో 22,588 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, వార్షిక ప్రాతిపదికన దాని అమ్మకాల్లో 43% క్షీణత ఉంది.

Tata Tiago: టాటా టియాగో జులై 2023లో 8982 యూనిట్లను విక్రయించగా, జులై 2022లో 6159 యూనిట్లు సేల్ అయ్యాయి. అంటే, వార్షిక ప్రాతిపదికన దాని అమ్మకాల్లో 46% జంప్ ఉంది.

Tata Altroz: జులై 2023లో టాటా ఆల్ట్రోజ్ 7817 యూనిట్లు విక్రయించగా, జులై 2022లో 5678 యూనిట్లు సేల్ అయ్యాయి. అంటే, వార్షిక ప్రాతిపదికన దాని అమ్మకాల్లో 38% జంప్ ఉంది.

ఇవి కాకుండా జులై 20 నాటికి మారుతి సుజుకి ఆల్టో 7099 యూనిట్లు, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 5337 యూనిట్లు, హ్యుందాయ్ ఐ20 5001 యూనిట్లు, టయోటా గ్లాంజా 4902 యూనిట్లు, మారుతి సుజుకి ఇగ్నిస్ 3223 యూనిట్లు జులై 2023లో విక్రయించబడ్డాయి.

Tags:    

Similar News