Best Compact SUV Under 10 Lakh: రూ. 10 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే.. అదిరిపోయే ఫీచర్లు.. టాటా, మారుతీ సహా ఇంకెన్నో..!

Best Compact SUV Under 10 Lakh: భారత్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్ ఉంది. కియా, హ్యుందాయ్ నుండి మారుతి వరకు అన్ని కంపెనీలు ఈ విభాగంపై దృష్టి సారించాయి. 8-10 లక్షల బడ్జెట్‌లో ఈ విభాగంలో చాలా వాహనాలు ఉన్నాయి.

Update: 2025-02-02 13:15 GMT

Best Compact SUV Under 10 Lakh: రూ. 10 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే.. అదిరిపోయే ఫీచర్లు.. టాటా, మారుతీ సహా ఇంకెన్నో..!

Best Compact SUV Under 10 Lakh: భారత్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్ ఉంది. కియా, హ్యుందాయ్ నుండి మారుతి వరకు అన్ని కంపెనీలు ఈ విభాగంపై దృష్టి సారించాయి. 8-10 లక్షల బడ్జెట్‌లో ఈ విభాగంలో చాలా వాహనాలు ఉన్నాయి. మీరు కూడా రానున్న రోజుల్లో కొత్త కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటే వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

1. టాటా పంచ్

టాటా పంచ్ దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. పంచ్ ప్రారంభ ధర రూ.6 లక్షలు మాత్రమే. కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్,సిఎన్‌జి ఆప్షన్లు ఉన్నాయి. పంచ్ పెట్రోల్ వేరియంట్ 18-20 KMPL మైలేజీ ఇస్తుంది. CNG మోడల్ సుమారు 26 Km/kg ఇస్తుంది.

టాటా పంచ్‌లో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెనుక AC వెంట్‌లు, సెంటర్ కన్సోల్‌లో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్‌తో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సెంట్రల్ లాకింగ్,  యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2. హ్యుందాయ్ వెన్యూ

సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ఈ కారుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హ్యుందాయ్ వెన్యూ ధర రూ. 7.94 లక్షల నుండి రూ. 13.53 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్,1.5-లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి.

వెన్యూలో సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్‌, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్‌తో కూడిన ఇబిడి, వెనుక పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, లెవెల్-1 అడాస్ సూట్ ఫీచర్లు ఇచ్చారు.

3. మారుతి ఫ్రాంక్స్

ఫ్రాంక్స్ మారుతి ఫేమస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. కారు ధర రూ. 7.51 లక్షల నుండి రూ. 13.04 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంటుంది. 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు కారులో ఉంటాయి. మారుతి ఫ్రాంక్స్ 20.1 నుండి 28.51KMPL వరకు మైలేజీని ఇస్తుంది.

ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లతో స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 360 డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి.

4. కియా సైరోస్

ఈ ఎస్‌యూవీని కియా ఇటీలే విడుదల చేసింది. కారు ధర రూ. 8.99 లక్షల నుండి రూ. 17 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంటుంది. సైరోస్‌లో 1.0-లీటర్ టర్బో పెట్రోల్,  1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. ఎస్‌యూవీ మైలేజ్ 17.65 నుండి 20.75 kmpl మధ్య ఉంటుంది.

కియా సైరోస్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం డ్యూయల్-12.3-అంగుళాల స్క్రీన్‌లు, క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్‌తో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్, సైడ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News