Electric Car Market: 2028 నాటికి భారత ఈవీ మార్కెట్‌లో 7% వాటా దాటనుందట..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. సరఫరా గొలుసు సమస్యలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కొరత వంటి సమస్యలను సకాలంలో పరిష్కరించగలిగితే 2028 ఆర్థిక సంవత్సరానికి ఎలక్ట్రిక్ కార్ల వాటా 7% దాటుతుందని కేర్ ఎడ్జ్ అడ్వైజరీ నివేదిక పేర్కొంది.
Electric Car Market: 2028 నాటికి భారత ఈవీ మార్కెట్‌లో 7% వాటా దాటనుందట..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. సరఫరా గొలుసు సమస్యలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కొరత వంటి సమస్యలను సకాలంలో పరిష్కరించగలిగితే 2028 ఆర్థిక సంవత్సరానికి ఎలక్ట్రిక్ కార్ల వాటా 7% దాటుతుందని కేర్ ఎడ్జ్ అడ్వైజరీ నివేదిక పేర్కొంది. అమెరికన్ ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడంతో ఈ రంగంపై నమ్మకం మరింత పెరిగింది.
భారత ఈవీ మార్కెట్ వృద్ధి
2021 ఆర్థిక సంవత్సరంలో కేవలం 5,000 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, 2025 నాటికి ఈ సంఖ్య 1.07 లక్షలు దాటింది.
ఇప్పటికీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకే పెద్ద మార్కెట్ ఉన్నా, ఫోర్ వీలర్స్ విభాగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
వృద్ధికి ప్రధాన కారణాలు
ప్రభుత్వ ప్రోత్సాహకాలు: ఫేమ్-3, అధునాతన బ్యాటరీలకు PLI పథకం, బ్యాటరీ ముఖ్యమైన ఖనిజాలపై కస్టమ్ సుంకం మినహాయింపు.
చార్జింగ్ మౌలిక సదుపాయాలు: 2022లో 5,151 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా, 2025 ప్రారంభానికి ఈ సంఖ్య 26,000 దాటింది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు భూమి, సబ్సిడీ లాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.
ప్రైవేట్ రంగం భాగస్వామ్యం: CPOలు తమ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నారు. BEE, NITI ఆయోగ్ ఛార్జర్ స్టాండర్డైజేషన్, ఇంటర్‌ఆపరేబిలిటీపై పనిచేస్తున్నాయి.
బ్యాటరీ లోకలైజేషన్: దేశీయంగా బ్యాటరీ తయారీ పెరగడంతో, 2022లో 100% దిగుమతులపై ఆధారపడి ఉండగా, 2027 నాటికి ఇది 20%కే తగ్గే అవకాశం ఉంది.
ప్రభుత్వ విధానాలు, సాంకేతిక పురోగతి, టెస్లా వంటి ప్రముఖ కంపెనీల ప్రవేశంతో భారత్‌లో ఈవీ మార్కెట్ రాబోయే ఏళ్లలో మరింత వేగంగా విస్తరించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.