Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్‌లు షార్ట్ సర్క్యూట్‌కి గురవుతాయా.. ఈ విషయాలు తెలుసుకోండి..!

Electric Scooters: నేటి రోజుల్లో ఇంధన ధరలు పెరగడంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు.

Update: 2023-08-14 11:56 GMT

Electric Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్‌లు షార్ట్ సర్క్యూట్‌కి గురవుతాయా.. ఈ విషయాలు తెలుసుకోండి..!

Electric Scooters: నేటి రోజుల్లో ఇంధన ధరలు పెరగడంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. వీటివల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అంతేకాదు వీటి కొనుగోలుకి ప్రభుత్వాలు సబ్సిడీలు కూడా అందిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ వర్షాకాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు షార్ట్‌ సర్క్యూట్‌కి గురవుతాయనే అనుమానం చాలా మందిలో ఉంది. దీని గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం.

ఈ రోజుల్లో వర్షం కురిసే రోడ్లు, ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. కొన్నిసార్లు వరదల వల్ల కార్లు, బైక్‌లు కూడా మునిగిపోతున్నాయి. ఇలాంటి సందర్బాలలో ఎలక్ట్రిక్ వాహనాలు మళ్లీ పనిచేస్తాయా.. అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతోంది. అలాగే ఛార్జింగ్ పెడుతున్నప్పుడు షార్ట్‌ సర్క్యూట్‌కి గురవుతాయని కొంతమంది బయపడుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే ఛార్జర్ ఇంటికి వచ్చే ఆల్టర్నేటింగ్ కరెంట్ (AC)ని డైరెక్ట్ కరెంట్ (DC)గా మారుస్తుంది. AC కంటే DC చాలా ప్రమాదకరమైనది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు బ్యాటరీలతో నడుస్తాయి. వీటికి శక్తి కావాలంటే ఛార్జింగ్ పెట్టాలని అందరికీ తెలుసు . ఈ మొత్తం ప్రక్రియ విద్యుత్‌కు సంబంధించినది దీనిని తప్పుగా చేస్తే ప్రమాదం జరుగుతుంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ, లోపలి వైర్లు ఇన్సులేటెడ్ రబ్బరుతో కప్పబడి ఉంటాయి. కాబట్టి నీరు ఏ భాగంలోకి వచ్చినా కరెంట్ వ్యాపించదు. ఎలక్ట్రిక్ స్కూటర్లకు అతి పెద్ద ప్రమాదం షార్ట్ సర్క్యూట్. దీనివల్ల స్కూటర్ల బ్యాటరీకి మంటలు అంటుకుని పేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్కూటర్ వైరింగ్ తారుమారు అయినప్పుడు ఇలా జరుగుతుంది.

కస్టమర్ బయటి మార్కెట్ నుంచి EV భాగాలను మార్చినప్పుడు ఏదైనా వైర్‌ కట్‌ అయి ఉంటే నీరు లోపలికి వెళ్లి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్లను నడిపే వారు బయట మార్కెట్ నుంచి వాహనంలో ఎలాంటి మార్పులు చేయకూడదు. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎక్కడపడితే అక్కడ ఏదైనా సాకెట్‌లో పెట్టి ఛార్జ్ చేయకూడదు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఉంటుంది. కంపెనీ సూచనల మేరకు ఛార్జింగ్ విధానాన్ని అనుసరించాలి. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎప్పుడూ రాత్రిపూట ఛార్జ్‌లో ఉంచకూడదు. ఓవర్‌ఛార్జ్ అవడం వల్ల పేలిపోతుంది.

Tags:    

Similar News