Citroen Basalt Discount: 2024 లాస్ట్ ఆఫర్.. సిట్రోయెన్ SUV పై రూ.80 వేల డిస్కౌంట్

Update: 2024-12-19 10:55 GMT

Citroen Basalt Discount: సిట్రోయెన్ ఇండియా కొత్త బసాల్ట్ కూపే SUVపై ఏడాది చివర్లో రూ. 80,000 తగ్గింపును అందిస్తోంది. ప్రారంభించిన తర్వాత మొదటి నెలలో బసాల్ట్‌కు డిమాండ్ బాగానే ఉంది. అయితే ఆ తర్వాత వినియోగదారుల నుండి ఈ కారుకు కొంత డిమాండ్ తగ్గింది. అందుకే కంపెనీ మరోసారి కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

ఆగస్టులో 579 యూనిట్లు, సెప్టెంబరులో 341 యూనిట్లు, అక్టోబర్‌లో 221 యూనిట్లు, నవంబర్‌లో 47 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. భారతీయ మార్కెట్లో ఇది టాటా కర్వ్‌తో నేరుగా పోటీపడుతోంది. బసాల్ట్ కారు ఎక్స్‌షోరూం ధరలు రూ.7.99 లక్షల నుంచి రూ.13.95 లక్షల వరకు ఉన్నాయి. ఈ కూపే SUV ఇటీవల ఇండియా NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది.

ఈ కారు ఫ్రంట్ ఎండ్ సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌తో సమానంగా ఉంటుంది. ఇది సిమిలర్ స్టైల్ DRLలు, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, గ్రిల్, ముందు భాగంలో ఎయిర్ ఇన్‌టేక్, ప్లేస్‌మెంట్‌ను కూడా కలిగి ఉంది. బసాల్ట్ డిజైన్ పరిశీలిస్తే ఇది ఒక కూపే రూఫ్‌లైన్‌ను పోలి ఉంటుంది. ఇది బి-పిల్లర్ నుండి హై డెక్ మూత వరకు బిల్ట్ ఇన్‌స్పాయిలర్ లిప్‌తో ఉంటుంది. 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ అమర్చారు.

ఈ కారు లేఅవుట్, డాష్‌బోర్డ్ డిజైన్, 10.25-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్స్ విషయంలో ఇది C3 ఎయిర్‌క్రాస్‌ను పోలి ఉంటుంది. ఎయిర్‌క్రాస్ లో లేనిది, ఈ కారులో అదనంగా ఉన్నది ఏంటంటే.. ఇది 7.0-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది వెనుక సీట్లకు అండర్ థై సపోర్ట్‌ను కలిగి ఉంది. బసాల్ట్‌లో 15-వాట్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టింగ్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. ఇందులో రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది నాచురల్ ఆశ్పిరేటెడ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది 81 bhp, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. బసాల్ట్‌లో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఛాయిస్ కూడా ఉంది. ఇది 108 bhp, 195Nm తో వస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

ఇది పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, గార్నెట్ రెడ్, కాస్మో బ్లూ వంటి 5 సింగిల్-టోన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. వైట్, బ్లాక్ కలర్ పైకప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారుకు సంబంధించిన అన్ని వేరియంట్స్, వాటి ధరలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఇండియాలో ఇది టాటా కర్వ్‌తో పాటు మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

Tags:    

Similar News