Maruti Grand Vitara Hybrid: ఈ ఆఫర్ పోతే రాదు.. భారీ మైలేజీ ఇచ్చే మారుతి కారుపై ఏకంగా రూ.1.75లక్షల తగ్గింపు
Maruti Grand Vitara Hybrid: భారతీయ మార్కెట్‌లో అత్యధిక కార్లను విక్రయించే కంపెనీలలో మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉంటుంది. మారుతి సుజుకి నెక్సా తమ కొన్ని కార్లపైన భారీ డిస్కౌంట్ ఆఫర్‌లను ప్రకటించింది.
Maruti Grand Vitara Hybrid: ఈ ఆఫర్ పోతే రాదు.. భారీ మైలేజీ ఇచ్చే మారుతి కారుపై ఏకంగా రూ.1.75లక్షల తగ్గింపు
Maruti Grand Vitara Hybrid: భారతీయ మార్కెట్‌లో అత్యధిక కార్లను విక్రయించే కంపెనీలలో మారుతి సుజుకి అగ్రస్థానంలో ఉంటుంది. మారుతి సుజుకి నెక్సా తమ కొన్ని కార్లపైన భారీ డిస్కౌంట్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్లు ఆగస్టు 2025 వరకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా, 2024 మోడల్ గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ కారుపై ఏకంగా రూ.1.75 లక్షల వరకు డిస్కౌంట్‌ను కొన్ని మారుతి నెక్సా డీలర్‌షిప్‌లు అందిస్తున్నాయి.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ కారుపై లభిస్తున్న రూ.1.75 లక్షల డిస్కౌంట్ ఆఫర్ కింద రూ.60,000 వరకు నగదు తగ్గింపు, రూ.80,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ లభిస్తాయి. ఈ హైబ్రిడ్ మోడల్‌తో పాటు, 2024 మోడల్ గ్రాండ్ విటారా పెట్రోల్ వేరియంట్‌లపై కూడా రూ.1.55 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో డెల్టా, జెటా, ఆల్ఫా వంటి ట్రిమ్స్‌పై రూ.57,900 వరకు ఉచిత యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు గ్రాండ్ విటారా సీఎన్‌జీ మోడల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, రూ.40,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్ ధర రూ.16.99 లక్షల నుంచి రూ.20.09 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా వస్తుంది. దీనికి సీవీటీ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది. ఈ కారు అద్భుతంగా లీటరుకు ఏకంగా 27.7కిమీ మైలేజీ ఇస్తుంది. దీని 45 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో దాదాపు 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
ఇందులో 360-డిగ్రీ కెమెరా, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, సుజుకి కనెక్ట్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంక్రేజ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో 470 లీటర్ల బూట్ స్పేస్ కూడా లభిస్తుంది.
మారుతి సుజుకి సెప్టెంబర్ 3, 2025న ఒక కొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఈ కొత్త మోడల్ గ్రాండ్ విటారా కన్నా తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారును మారుతి అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తారు. ఈ కొత్త ఎస్‌యూవీ కూడా గ్రాండ్ విటారాకు సంబంధించిన ప్లాట్‌ఫామ్, ఇంజిన్, డిజైన్, ఫీచర్లనే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కొత్త కారు రాబోతున్న నేపథ్యంలో, ఇప్పుడు గ్రాండ్ విటారాపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే వెంటనే డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.