Best Selling Bike: భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ బైక్ ఇదే.. లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?

Best Selling Bike: భారత్‌లో ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే..150సిసి నుంచి 200సిసి ఇంజన్ కలిగిన బైక్స్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ బైక్స్ పట్ల యువతలో విపరీతమైన క్రేజ్ కనిపిస్తుంది.

Update: 2025-03-01 01:00 GMT

Best Selling Bike: భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ బైక్ ఇదే.. లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?

Best Selling Bike: భారత్‌లో ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే..150సిసి నుంచి 200సిసి ఇంజన్ కలిగిన బైక్స్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ బైక్స్ పట్ల యువతలో విపరీతమైన క్రేజ్ కనిపిస్తుంది. ఇవి ప్రతి నెలా రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఈ సెగ్మెంట్‌లో బజాజ్ ఆటోకు చెందిన పల్సర్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 15 బైక్‌ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. బజాజ్ పల్సర్ గత నెలలో 37,753 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 20,872 యూనిట్లుగా ఉంది. ఈసారి బజాజ్ 16,881 పల్సర్ బైక్స్‌ను విక్రయించింది. MOM వృద్ధి 81శాతం కాగా, గత నెలలో కంపెనీ మార్కెట్ వాటా 22.71గా ఉంది.

బజాజ్ పల్సర్ కూడా అమ్మకాల పరంగా టీవీఎస్ అపాచీని అధిగమించింది. గత నెలలో కంపెనీ ఈ బైక్‌ను 34,511 యూనిట్లను విక్రయించింది. కాగా, హోండా యునికార్న్ గత నెలలో 26,509 యూనిట్లను విక్రయించి మూడవ స్థానంలో నిలిచింది. యమహా ఎఫ్‌జెడ్ 11,399 యూనిట్ల విక్రయాలతో నాల్గవ స్థానంలో ఉండగా, యమహా ఎమ్‌టి 15 గత నెలలో 10,640 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో ఉంది.

Top 3 Best Sellers

బజాజ్ పల్సర్- 37,753 యూనిట్స్

టీవీఎస్ అపాచీ-34,511 యూనిట్స్

హోండా యునికార్న్- 26,509 యూనిట్స్

యమహా ఎఫ్‌జెడ్-11,399 యూనిట్స్

Bajaj Pulsar

బజాజ్ పల్సర్ దేశంలో అత్యంత విశ్వసనీయమైన బైక్. చాలా సంవత్సరాలుగా ఈ బైక్‌ను యువతతో పాటు ఫ్యామిలీ క్లాస్ కూడా ఇష్టపడుతున్నారు. పల్సర్ కాకుండా, బజాజ్ చాలా బైక్‌లను మార్కెట్లోకి విడుల చేసింది. అయితే ఆ బైక్స్‌కు పల్సర్‌ అందుకున్న విజయాన్ని సాధించలేకపోయాయి. బజాజ్ పల్సర్ డిజైన్, ఇంజన్ అతిపెద్ద ఆకర్షణ. పల్సర్ విక్రయాలు అత్యధికంగా ఉండడానికి ఇదే కారణం. ప్రస్తుతం, బజాజ్ వద్ద 125 ఇంజన్ నుండి పల్సర్ 200 వరకు ప్రీమియం బైక్‌లు ఉన్నాయి. బజాజ్ ఆటో ఈ సంవత్సరం మరికొన్ని కొత్త మోడళ్లను బజాజ్ లాంచ్ చేస్తుంది.

Tags:    

Similar News