Bajaj Pulsar Offer: పాతికేళ్లు పూర్తి చేసుకున్న పల్సర్.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది..!

బజాజ్ పల్సర్.. ఇండియాలో పెద్దగా పరిచయం అవసరం లేని బైక్. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు యువకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Update: 2026-01-04 14:30 GMT

Bajaj Pulsar Offer: పాతికేళ్లు పూర్తి చేసుకున్న పల్సర్.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది..!

Bajaj Pulsar Offer: బజాజ్ పల్సర్.. ఇండియాలో పెద్దగా పరిచయం అవసరం లేని బైక్. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు యువకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేశీ మార్కెట్లోకి పల్సర్ బైక్ అడుగు పెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో ’25 సంవత్సరాల పల్సర్ సెలబ్రేషన్ ఆఫర్’ను ప్రకటించింది. ఎంపిక చేసిన పల్సర్ మోడళ్లలో రూ.7,000 వరకు తగ్గింపు ఆఫర్ ను అందిస్తుంది. కచ్చితమైన ప్రయోజనాలు, మోడల్ తో పాటు ప్రాంతాన్ని బట్టి మారుతాయని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ప్రకటన ప్రకారం.. 25వ వార్షికోత్సవ ఆఫర్‌ లో భాగంగా సేవింగ్స్, ప్రాసెసింగ్ ఫీజుల మినహాయింపు, ఐదు ఉచిత సర్వీసులు అందిస్తోంది. ఈ ఆఫర్ బజాజ్ డీలల్స్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ లోనే ఉంటుందని కంపెనీ తెలిపింది.

పల్సర్‌ దేశీ మార్కెట్లో మొదటిసారి నవంబర్ 2001లో విడుదల అయ్యింది. తాజాగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి యువతకు క్రేజీ బైక్ గా మారిపోయింది. అద్భుతమైన పనితీరు, ఆకట్టుకునే లుక్ కారణంగా ఈ మోడల్ బాగా పాపులర్ అయ్యింది. దేశీ మార్కెట్లో స్పోర్ట్స్, నేకెడ్ మోటార్ సైకిల్ విభాగాలను రూపొందించడంలో పల్సర్ కీలక పాత్ర పోషించింది. పవర్, రైడింగ్ డైనమిక్స్‌ పై దృష్టి సారించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రాండ్ పలు ప్రాంతీయ, కస్టమర్ కు అనుగుణంగా అప్ డేట్స్ చేస్తూ వచ్చింది.

2001లో పల్సర్ విడుదలైన తర్వాత నుంచి ఇప్పటి వరకు చాలా అప్ డేట్స్ పొందింది. ప్రస్తుతం ఈ మోడల్ లైనప్ లో పల్సర్ 125, పల్సర్ N125, పల్సర్ NS125, పల్సర్ 150, పల్సర్ N160, పల్సర్ NS160, పల్సర్ NS200, పల్సర్ RS200, పల్సర్ 220F, పల్సర్ N250, పల్సర్ NS400Z లాంటి మోడళ్లు ఉన్నాయి. ధర రూ. 85,633 నుంచి రూ.1,92,794 వరకు ఉంది.

పల్సర్ బైక్ 25 ఏళ్ల మైలురాయి సాధించిన నేపథ్యంలో ప్రాంతీయ డిమాండ్ మోడల్ ను బట్టి ప్రసిద్ధ పల్సర్ మోడళ్లలో వార్షికోత్సవ ఆఫర్లను అందిస్తున్నట్లు బజాజ్ కంపెనీ ప్రకటించింది. యువ కొనుగోలుదారులకు పల్సర్ మోటార్ సైకిళ్లను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు బజాజ్ వెల్లడించింది. “గత 25 సంవత్సరాలుగా, పల్సర్ పనితీరు మోటార్‌ సైక్లింగ్ రంగంలో సరికొత్త ఒరవడికి కారణం అయ్యింది. మేము ఈ అరుదైన మైల్ స్టోన్ సందర్భంగా ’25 సంవత్సరాల పల్సర్ వేడుక ఆఫర్’ మా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ బైక్ మా కంపెనీ ప్రతిష్టను పెంచడంతో పాటు కమస్టమర్ల పల్ల మా నిబద్దతను చూపిస్తుంది” అని బజాజ్ ఆటో మోటార్‌ సైకిల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ సారంగ్ కనాడే సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News