Mahashivratri 2026: శివరాత్రికి ముందే గ్రహాల అద్భుత కలయిక.. ఈ రాశుల వారికి ఇక కనకవర్షమే!
Mahashivratri 2026 Horocope Telugu: మహాశివరాత్రి పర్వదినానికి ముందు ఖగోళంలో ఒక కీలకమైన గ్రహ మార్పు చోటుచేసుకోబోతోంది.
Mahashivratri 2026 Horocope Telugu: మహాశివరాత్రి పర్వదినానికి ముందు ఖగోళంలో ఒక కీలకమైన గ్రహ మార్పు చోటుచేసుకోబోతోంది. ఫిబ్రవరి 13వ తేదీన సూర్య భగవానుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో రాహువు సంచరిస్తుండటంతో, అక్కడ సూర్య-రాహువుల సంయోగం ఏర్పడనుంది. ఈ అరుదైన కలయిక వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ధనలాభం, మానసిక ప్రశాంతత లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
గ్రహాల ప్రభావం ఏ రాశులపై ఎలా ఉందంటే?
1. మేష రాశి (Aries): మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, సూర్య-రాహువుల కలయిక అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. అనవసర ఖర్చులు తగ్గి, పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పదోన్నతులు పొందే సూచనలు కనిపిస్తున్నాయి.
2. సింహ రాశి (Leo): శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్న సింహ రాశి వారికి ఈ సంయోగం ఊరటనిస్తుంది. మానసిక ఆందోళనలు తొలగిపోయి, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. విలువైన వస్తువులు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
3. ధనస్సు రాశి (Sagittarius): ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ప్రభావవంతమైన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.
4. కుంభ రాశి (Aquarius): సూర్యుడు, రాహువుల కలయిక కుంభరాశిలోనే జరుగుతుండటంతో వీరికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి శాశ్వత విముక్తి లభించడమే కాకుండా, ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు లేదా మత గ్రంథాలు వంటి వివిధ మాధ్యమాల నుండి సేకరించి ఇవ్వబడింది. hmtv న్యూస్ దీనిని ధృవీకరించడం లేదు.