Mercury And Saturn: 500 ఏళ్ల తర్వాత బుధుడు, శని తిరోగమనం.. 3 రాశుల వారికి డబ్బుతో పాటు లగ్జరీ లైఫ్ సొంతం..

Mercury And Saturn: ఈ ఏడాది శ్రావణ మాసం గత సంవత్సరంతో పోలిస్తే ఎంతో ప్రత్యేకమైనదిగా జ్యోతిష్య శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Update: 2025-07-03 06:08 GMT

Mercury And Saturn: 500 ఏళ్ల తర్వాత బుధుడు, శని తిరోగమనం.. 3 రాశుల వారికి డబ్బుతో పాటు లగ్జరీ లైఫ్ సొంతం..

Mercury And Saturn Retrograde Effect On Zodiac: ఈ ఏడాది శ్రావణ మాసం గత సంవత్సరంతో పోలిస్తే ఎంతో ప్రత్యేకమైనదిగా జ్యోతిష్య శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే, ఈ జూలై 11న ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో అరుదైన గ్రహ సంచారాలు, సంయోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగా కారణంగా కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలయ్యే అవకాశం ఉంది. సంపాదన పెరగడమే కాదు, జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ శ్రావణ మాస విశేషాలు:

జూలై 11 నుంచి సూర్యుడు, శుక్రుడు, కుజుడు ఒకే సమయంలో సంచరించనుండగా, 500 ఏళ్ల తర్వాత శని గ్రహంతో పాటు బుధుడు తిరోగమనం చేయబోతున్నారు. ఈ అరుదైన గ్రహమాలిక కారణంగా కొన్ని రాశులపై శుభఫలితాలు కనపడనున్నాయి.

కన్యా రాశి:

ఈ శ్రావణ మాసం కన్యా రాశి వారికి అత్యంత శుభకార్యమైనదిగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శివుని అనుగ్రహంతో వృద్ధి, ఆర్థిక లాభాలు, కొత్త బాధ్యతలు, శత్రుపక్షాలపై విజయం వంటి ఫలితాలు లభించనున్నాయి. ఉద్యోగవర్గానికి ప్రోత్సాహకరమైన పదోన్నతులు, సరికొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది.

వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసం ప్రత్యేకమైన శుభవార్తలు అందించనుంది. పాత అప్పులు తీరి, ఆర్థిక స్థితి బలపడనుంది. అదృష్టం పెరిగి, వైదేశిక ప్రయాణాలు, పెట్టుబడుల్లో లాభాలు చవిచూడనున్నారు. ఈ కాలం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన సమయం.

కుంభ రాశి:

కుంభ రాశి వారి జీవితంలో ఈ శ్రావణ మాసం సానుకూలమైన మార్పులను తీసుకొస్తుంది. ఉద్యోగవర్గం వారికి జీతాల పెంపు, ప్రమోషన్‌లు, కొత్త ఇంటర్వ్యూల విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలోనూ పురోగతి, సమాజంలో గౌరవం, ఖ్యాతి పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలమైన ఫలితాలు అందుతాయి.

మొత్తానికి, ఈ శ్రావణ మాసం అరుదైన గ్రహ సంయోగాల నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, సామాజిక స్థితిలో అనూహ్యంగా అభివృద్ధి కరమైన రోజులు ముంచుకొస్తున్నాయి.

Tags:    

Similar News