దెందులూరు మాజీ MLA అబ్బయ్య చౌదరి హౌస్ అరెస్ట్

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత ఎలరు అబ్బయ్య చౌదరిని పోలీసులు ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు.

Update: 2025-12-10 05:51 GMT

దెందులూరు మాజీ MLA అబ్బయ్య చౌదరి హౌస్ అరెస్ట్

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత ఎలరు అబ్బయ్య చౌదరిని పోలీసులు ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం ముగింపు సందర్భంగా నిర్వహించే ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఆయన తన నివాసం నుంచి బయలుదేరగా, పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు.

నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అబ్బయ్య చౌదరికి తెలియజేశారు. దీంతో ఆయన ఇంటి వద్దే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమానికి వెళ్లడానికి అనుమతి నిరాకరించడంపై అబ్బయ్య చౌదరి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

పోలీసుల చర్యపై అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. "రాష్ట్రంలో ఎక్కడా లేని రూల్, నిబంధన కేవలం దెందులూరులోనే ఎందుకు అమలవుతోంది? రాష్ట్రమంతటా 'కోటి సంతకాల' కార్యక్రమాలు జరుగుతుంటే, ఇక్కడే ఎందుకు అడ్డుకుంటున్నారు?" అని ఆయన పోలీసులను నిలదీశారు.

పోలీసుల ఆంక్షల నేపథ్యంలో అబ్బయ్య చౌదరి ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ అరెస్ట్‌తో దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Tags:    

Similar News