ఎట్టకేలకు విజయవాడలో వైఎస్సార్‌ విగ్రహం పున:ప్రతిష్ట

Update: 2019-09-02 13:06 GMT

విజయవాడ నగరంలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వద్ద పునఃప్రతిష్టించిన దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఎట్టకేలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. పులివెందుల నుంచి నేరుగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్.. తన తండ్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే కంట్రోల్‌ రూమ్‌ సమీపంలోని ప్రగతి పార్క్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ పార్క్‌గా నామకరణం చేశారు. వాస్తవానికి ఈ కార్యక్రమం 4 గంటలకే జరగాల్సి ఉన్నా వర్షం కారణంగా ఆలస్యం అయింది. ఈదురు గాలులతో అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు ఎగిరిపోయాయి. వర్షం పడటంతో విగ్రహం మీద ఉంచిన ముసుగు పూర్తిగా తడిచిపోయింది. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు సైతం తడిచిపోయాయి. కాగా పుష్కరాల పేరుతో నాటి టీడీపీ ప్రభుత్వం విజయవాడ వైఎస్ విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News