YS Sharmila: ఆస్తి కోసం చిన్నాన్న హత్య జరగలేదు.. సునీత పేరు మీద ఆస్తులు...
YS Sharmila: వైఎస్ వివేకా హత్యోదంతంపై షర్మిల మరోసారి స్పందించారు.
YS Sharmila: ఆస్తి కోసం చిన్నాన్న హత్య జరగలేదు.. సునీత పేరు మీద ఆస్తులు...
YS Sharmila: వైఎస్ వివేకా హత్యోదంతంపై షర్మిల మరోసారి స్పందించారు. ఆస్తి కోసం హత్య జరగలేదన్నారు. సునీత పేరు మీద తన చిన్నాన్న ఎప్పుడో వీలునామా రాశారని తెలిపారు. లేని వ్యక్తి మీద విష ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ వివేకా ప్రజానాయకుడని.. జనం మనిషి అని ఆమె పేర్కొన్నారు. సునీతకు ఆయన్ను హత్య చేయాల్సిన మోటీవ్ లేదన్నారు. ఆయన చివరి వరకు ప్రజల కోసమే పనిచేశాడని… ఆయన వ్యక్తిత్వంపై ఇప్పుడు దాడి చేయడం సరికాదన్నారు. వివేకా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదని షర్మిల అన్నారు. ఆయనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు.