CM Jagan: చదువులతోనే ప్రతీ పేద కుటుంబం ఉన్నత స్థాయిలోకి వస్తుంది
CM Jagan: కల్యాణమస్తు, షాదీతోఫా నిధులను విడుదల చేసిన సీఎం జగన్
CM Jagan: చదువులతోనే ప్రతీ పేద కుటుంబం ఉన్నత స్థాయిలోకి వస్తుంది
CM Jagan: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు సీఎం జగన్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాల్లో నగదు జమ చేశారు. జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12 వేల 132 మంది లబ్ధిదారులకు 87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు.
కళ్యాణమస్తు అర్హతకు పదో తరగతి చదివి ఉండాలని నిబంధన తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. టెన్త్ కచ్చితంగా చదివి ఉంటేనే కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం అందుతుందన్నారు. ఇలా, టెన్త్ చదివించాలనే తపన ప్రతీ కుటుంబంలో మొదలవుతుందని పేర్కొన్నారు. ఈ పథకాలకు అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు కనీస వయసు నిర్ధారించామన్నారు.
18 ఏళ్ల నిబంధన వల్ల చదువులు ముందుకు సాగుతాయని కనీసం డిగ్రీ వరకు చదివే వెసులుబాటు ఉంటుందని జగన్ అన్నారు. చదువులతోనే ప్రతీ పేద కుటుంబం ఉన్నత స్థాయిలోకి వస్తుందని విద్యాదీవెన, వసతి దీవెన ఉండటం వల్ల కనీసం డిగ్రీ వరకు చదువుతారని చెప్పారు. డిగ్రీ వరకు పిల్లల చదవుల భారం ప్రభుత్వమే భరిస్తుందని. అమ్మఒడి మరో ప్రోత్సాహకరంగా ఉంటుంది అని సీఎం జగన్ తెలిపారు.