డిసెంబర్ నాటికి వంశధార– నాగావళి అనుసంధానం పూర్తి

రాష్ట్రంలో జలయజ్ఞాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2020-05-03 04:46 GMT

రాష్ట్రంలో జలయజ్ఞాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఉత్తరతీరాంధ్రకు వరప్రదాయిని అయిన వంశధార– నాగావళి అనుసంధానం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనీ సంకల్పించారు. ఈ రెండు నదులను అనుసంధానం చేసి 42,053 ఎకరాలకు నీరందించాలని సీఎం అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టే పనులు కూడా వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన రూ. 50 కోట్లను విడుదల చెయ్యాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం.

వంశధార– నాగావళి అనుసంధానం పనులను డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి.. జాతికి అంకితం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారు. కాగా 1959లో నాగావళి నదిపై ఆనకట్ట నిర్మించారు. దీంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కుడి కాలువ కింద 18,362, ఎడమ కాలువ కింద 18,691 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే నాగావళి వరద మాత్రం సెప్టెంబర్ నాటికే ముగుస్తుంది.. దాంతో పంట చివర్లో నీళ్లందక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈ క్రమంలో వంశధార వరద జలాలు మళ్లించి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పనుల్లో వేగం పెంచింది.


Tags:    

Similar News