ముస్లింలకు వైఎస్‌ జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

Update: 2019-05-06 14:49 GMT

రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం ప్రజలకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య పవిత్ర మాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకుంటారు, మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌.. ఈ సందర్బంగా వారికి అల్లాహ్‌ దీవెనలు లభించాలని  జగన్ఆకాంక్షించారు. 

Similar News