వివేకా హత్య కేసులో తండ్రి అరెస్టుపై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి

Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టుపై కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి స్పందించారు.

Update: 2023-04-16 11:25 GMT

వివేకా హత్య కేసులో తండ్రి అరెస్టుపై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి

Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టుపై కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి స్పందించారు. కేసు విచారణలో కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోందన్నారు. అర్థం పర్థం లేని విషయాలను సీబీఐ పెద్దదిగా చూపిస్తోందని.. దర్యాప్తు సంస్థ ఈ స్థాయికి దిగజారడం విచారకరమని వ్యాఖ్యానించారు.

మమ్మల్ని కావాలనే దోషులుగా చూపాలని ప్రయత్నిస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. దస్తగిరి వాంగ్మూలాన్ని, వాచ్‌మెన్‌ రంగన్న చెప్పిన విషయాలను సైతం సీబీఐ పట్టించుకోవట్లేదన్నారు. దస్తగిరికి సీబీఐ అధికారులే ముందస్తు బెయిల్ ఇప్పించారని చెప్పారు. విచారణను సీబీఐ అధికారులు, సునీత ప్రత్యేక కోణంలో తీసుకెళ్తున్నారని వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

Tags:    

Similar News