Anantapur: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి
Anantapur: విద్యుత్ షాక్‌తో తీవ్రంగా గాయపడి, మృతి చెందిన యువకుడు
Anantapur: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి
Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండలో కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. పట్టణంలోని రాయంపల్లి దారిలో ఉన్న జగనన్న కాలనీలో సులేమాన్ అనే యువకుడి కుటుంబం ఇంటిని నిర్మించుకుంటోంది. ఇందులో భాగంగా గత మూడు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఇంటి మిద్దె పైన ఉన్న ఇనుప కడ్డీలను కిందకు వేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి ముందు ఉన్న 33 కెవి విద్యుత్ లైన్ తీగలకు కడ్డీలు తాకడంతో కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతని అనంతపురం తరలించారు.పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదంలో జరిగిందని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.