అవ భూముల దొంగలను శిక్షించాలి : రఘురామకృష్ణంరాజు

Update: 2020-08-19 09:43 GMT

Ava Lands Scam: గోదావరి జిల్లాలలో అవ భూముల కుంభకోణంపై విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలి అని వైసీపీ నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం రచ్చబండ పేరుతో విలేకరులతో మాట్లాడారు. రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు యధాతదంగా.. "రాష్ట్రాన్ని ఫోన్ ట్యాపింగ్ అంశం కుదిపేస్తుంది. దీనిపై కేంద్ర హోం శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో నేను వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసాను. గోదావరి జిల్లాలలో అవ భూముల దొంగలను శిక్షించాలి. ముఖ్యమంత్రి కి సొంత బంధువులయినా మినహాయింపు ఇవ్వవద్దు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్రానికి సంబంధం లేదనడం అసంమజసం. ఈ విషయంలో రాష్ట్రానికో విధానం వేరుగా ఉండదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర హోం శాఖ పరిధిలోని అంశం.

ఫోన్ ట్యాపింగ్ కు ఎవరుపాల్పడినా శిక్షించాల్సిందే. లాక్ డౌన్ సడలింపులు రాకముందే మసీదులు, చర్చిలలో ప్రార్ధనలకు అనుమతించినప్పుడు, వినాయక ఉత్సవాలకు ఆటంకాలు కలిగించకుండా అనుమతించాలి. 85శాతం హిందూ ప్రజల మనోభావాలను గాయపరచవద్దు, భక్తుల మనోభావాలకు గౌరవం ఇవ్వాలి. కరోనా నిబంధనలు పాటిస్తూనే వినాయక మండపాలకు అనుమతి ఇవ్వాలి. ముఖ్యమంత్రి దీనిపై అధికారులతో తక్షణమే సమీక్షసమావేశాలు జరపాలి. ప్రభుత్వంలో పెద్దలకు కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్ పంపిమరీ వైద్యం చేయించినపుడు, ఒక కరోనా కేసులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా మంచి వైద్యం అందించాలి. ఆయనకు జరగరానిది జరిగితే ప్రభుత్వం భాధ్యత వహించాల్సి ఉంటుంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగా ప్రస్తుత సీఎం కక్షలు, కార్పణ్యాలకు అతీతంగా వ్యవహరించాలి" అని అన్నారు.

Tags:    

Similar News