TDP And YSRCP : ఒకే వేదికపై టీడీపీ ఎంపీ కేశినేని, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
TDP And YSRCP : మైలవరం బాలుర స్కూల్ కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవం
TDP And YSRCP : ఒకే వేదికపై టీడీపీ ఎంపీ కేశినేని, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
TDP And YSRCP : ఒకే వేదికపై టీడీపీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే..యస్..మీరు విన్నది నిజమే. ఎన్టీఆర్ జిల్లా మైలవరం బాలుర స్కూల్ కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవంలో విజయవాడ ఎంపీ కేసినేని నాని, వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. అంతేకాదు.. అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా కలిసి పని చేయడానికి సిద్ధమన్నారు ఎంపీ కేశినేని. తన పరిధిలో ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇక విజయవాడ ఎంపీ టికెట్ పైనా హాట్ కామెంట్స్ చేశారు కేశినేని. ఏ పిట్టల దొరకు ఎంపీ టికెట్ ఇచ్చిన అభ్యంతరం లేదన్నారు. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికలప్పుడే రాజకీయాలని.. ఆ తరువాత పార్టీలో సంబంధం లేకుండా పని చేస్తామన్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.