గౌతంరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధమైన వైసీపీ

Update: 2019-01-03 04:43 GMT

ముస్లింల మనోభావాలను కించపరిచ్చే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్న వైసీపీ నేత, గౌతమ్‌రెడ్డిపై ఆ పార్టీ వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఓ చానల్‌లో ముస్లిం మహిళల మనోభావాలను కించ పర్చే విధంగా గౌతమ్‌రెడ్డి మాట్లాడినట్టు కొందరు వ్యాఖ్యానించారు. దాంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. మూడు రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని వైసీపీ క్రమశిక్షణ సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. గౌతమ్‌రెడ్డి సంజాయిషీ చెప్పగానే ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసేందుకు వైసీపీ సిద్ధమవుతోన్నట్టు సమాచారం.

ఇదిలావుంటే వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై గతంలో సస్పెన్షన్ విధించింది ఆ పార్టీ. కొన్ని రోజుల తరువాత మళ్ళీ ఆయనను వైసీపీలోకి తీసుకుంది. ప్రస్తుతం గౌతంరెడ్డి వైఎస్‌ఆర్‌టీయూసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంనుంచి పోటీచేసి టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. 

Similar News