Yarlagadda Venkata Rao: టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు.. వంశీపై పోటీకి సై..!
Yarlagadda Venkata Rao: ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు.
Yarlagadda Venkata Rao: టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు.. వంశీపై పోటీకి సై..!
Yarlagadda Venkata Rao: ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ లో లోకేశ్ యార్లగడ్డకు పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం నారా లోకేష్ బస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కుల వృత్తుల స్టాళ్లను సందర్శించారు. గన్నవరం నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోగా.. అదే ఎన్నికల్లో ఆయనపై గెలిచిన టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ.... ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో యార్లగడ్డ, వంశీ మధ్య పోరు ఉండే అవకాశాలున్నాయి.