Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు
Chandrababu Arrest: గుంటూరు జిల్లా కొత్తపేట ఆంజనేయస్వామి ఆలయంలో కన్నా పూజలు
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు
Chandrababu Arrest: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. రాష్ట్రంలోని దేవాలయాల్లో పూజలు చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కొత్తపేట ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ. అయితే.. సమాచారం అందుకున్న పోలీసులు.. దేవాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ వలయాన్ని ఛేదించుకొని ఆలయంలోకి వెళ్లిన కన్నా.. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలంటూ పూజలు నిర్వహించారు.