ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఉమెన్స్ క్రికెటర్ శ్రీచరణి

ఉమెన్ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్ శ్రీచరణి ఇవాళ ఉదయం విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

Update: 2025-11-07 06:06 GMT

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఉమెన్స్ క్రికెటర్ శ్రీచరణి

ఉమెన్ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్ శ్రీచరణి ఇవాళ ఉదయం విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు మంత్రులు, స్థానిక ఎంపీ ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉమెన్ క్రీడాకారిణి శ్రీచరణితో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా ఉన్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు.

ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో శ్రీచరణి పంచుకున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటిచెప్పారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారన్నారు సీఎం చంద్రబాబు.

Tags:    

Similar News