కుటుంబం కోసం మగధీరుడిగా మారిన సావిత్రి

Update: 2020-10-27 06:18 GMT

మనిషి మారలేదు.. అతని మనసు మారలేదు అన్నాడో సినీ కవి. కానీ మనిషి మారింది. మనసూ మారింది..! ఆడబిడ్డగా పుట్టినా మగరాయుడిలా జీవిస్తోంది, మగధీరుడిలా కుటుంబాన్ని పోషిస్తుంది..! 70 ఏళ్లుగా తోడబుట్టినవాళ్లకోసం అన్నీ వదులుకుంది. బ్రహ్మచారిణిగా మిగిలిపోయింది..! ఇంతకూ ఎవరామె.. ఏమా కథ..?

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన సావిత్రి కథ లక్షల మందికి ఆదర్శంగా నిలిచిపోతుంది అనడం అతిశయోక్తి కాదు..! కుటుంబంలో అందరూ అడబిడ్డలే కావడంతో తల్లి సావిత్రిని మగబిడ్డగా చూసుకోవాలని ముచ్చట పడింది. అనుకున్నదే తడవుగా యుక్త వయస్సులో నిక్కర్, చొక్కా తొడిగింది అంతే సావిత్రి యువకుడిగా మెరిసింది కుటుంబాన్ని మురుపించింది.

ఇంతవరకూ బాగానే ఉన్నా ఒక్కసారిగా కుటుంబాన్ని కుదిపేసిన ఆర్థిక ఇబ్బందులు ఆమెను పూర్తిగా అతడుగా మార్చేశాయి. తోడబుట్టిన అక్కాచెల్లిళ్ళకి పెళ్ళిళ్ళు చేసేందుకు వివాహ బంధాన్నే వద్దనుకుని ఒంటరిగానే ఉండిపోయి స్త్రీవాదానికి కొత్త నిర్వచనం ఇచ్చేలా జీవిస్తోంది సావిత్రి. కుటుంబాన్ని పోషించాలంటే అన్ని పనులు చేయాలని నిర్ణయించుకున్న ఆమె మగాళ్లతో సమానంగా పనిచేసేది. ఆ కూలి డబ్బులతోనే కుటుంబాన్ని పోషించింది. తల్లిదండ్రుల మరణం తరువాత ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ల వివాహాలను ఆమే చేసింది. కుటుంబంకోసం మగాడిలా మారినందుకు గర్వంగా ఉంటుందంటుంది సావిత్రి. ఈ జన్మ తనకుటుంబం కోసమే అనుకుంది. మగాడిగానే తన జీవితంలో 70 ఏళ్ళు గడిపేసింది. ఈ పశ్చిమగోదావరి సావిత్రి గాథ ఎందరికో స్పూర్తిగా మిగిలిపోతుంది.

Full View


Tags:    

Similar News