Vasantha Krishna Prasad: సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యం
Vasantha Krishna Prasad: ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.
Vasantha Krishna Prasad: సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యం
Vasantha Krishna Prasad: ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంలో పులి వాగపై వంతెన ప్రారంభోత్సంలో ఆయన పాల్గొన్నారు. మీడియాలో రకరకాల కథనాలు, సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయన్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసినట్లు పేర్కొన్నారు. సీఎం జగనన్న ఆదేశాలను తప్పనిసరిగా ఆచరిస్తానన్నారు.