ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూతన స్పీకర్ ఎవరు..?

Update: 2019-05-27 13:41 GMT

ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామి సృష్టించింది. ఏకంగా 151 సీట్లతో ఊడ్చిపారేసింది. ఈనెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తరువాత వారం పదిరోజులకు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశముంది. ఇక ముఖ్యమంత్రి పదవి తరువాత అత్యంత కీలకమైనది స్పీకర్ పదవి. ఈ పదవికి సీనియర్ ఎమ్మెల్యేను ఎంపిక చెయ్యాలని జగన్ భావిస్తున్నారట. ముఖ్యంగా స్పీకర్ పదవికోసం ధర్మాన ప్రసాద్ రావు, ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ పేర్లు వినబడుతున్నాయి.

బొత్స సత్యనారాయణ అయితే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. స్పీకర్ పదవిపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో ఆనం లేదా ధర్మాన ప్రసాద్ రావు లలో ఎవరో ఒకరు స్పీకర్ చైర్ లో కూర్చునే అవకాశం ఉంది. ఆనం రామనారాయణరెడ్డి కూడా బొత్స ఫార్ములాను అమలుచేస్తున్నారు. దీంతో ధర్మాన వైపే అధిష్టానం మొగ్గుచూపే అవకాశం కనబడుతోంది. మరోవైపు సామాజిక సమీకరణాల దృష్ట్యా స్పీకర్ పదవి కాపులకు కేటాయిస్తారని చర్చ జరుగుతోంది. కాపు సామాజికవర్గానికే చెందిన బొత్స అంతగా ఆసక్తితో లేరు.. కాబట్టి అంబటి రాంబాబు లేదా ఇతర సీనియర్ నేతల పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. 

Similar News