అంగన్వాడీ కార్యకర్తలకు తెల్ల రేషన్ కార్డులు కొనసాగించాలి

రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో తల్లీ బిడ్డల సంక్షేమం కోసం, ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తునారు.

Update: 2019-12-02 11:19 GMT
ఆర్.సుబ్బలక్ష్మి, వై.ధనలక్ష్మి, ఆర్.ఉమామహేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు

తుని: రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో తల్లీ బిడ్డల సంక్షేమం కోసం, ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు తెల్ల రేషన్ కార్డులు కొనసాగించాలని ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 వేల 700 మంది అంగన్వాడీ వర్కర్లు అతి తక్కువ గౌరవ వేతనంతో పని చేస్తున్నారని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరల వలన వచ్చే ఆదాయం సరిపోక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం తమకు ఉన్న వైట్ రేషన్ కార్డును కొనసాగించాలని స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్.సుబ్బలక్ష్మి, వై.ధనలక్ష్మి, ఆర్.ఉమామహేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 


Tags:    

Similar News