ఏపీలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు : వాతావరణ శాఖ

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే నాలుగు రోజులు పాటు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది.

Update: 2020-06-08 14:43 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే నాలుగు రోజులు పాటు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగాల 48 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అలాగే రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. తగిన జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని, అధికారులను అప్రమత్తం చేసారు. జూన్ 9న కోస్తాంధ్రలో తెలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అలాగే జూన్ 10న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక జూన్ 11, 12న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీనితో పాటు రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది.


Tags:    

Similar News