Weather Update: దక్షిణ భారత్‌లోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు.. ఈనెల 24 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం
Weather Update: దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా ప్రకటించింది.
Weather Update: దక్షిణ భారత్‌లోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు.. ఈనెల 24 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం
Weather Update: దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది.
దక్షిణ భారతదేశంలోకి ఈశాన్య రుతుపవనాలు చురుకుగా ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు ధ్రువీకరించారు.
రానున్న రోజుల్లో వాతావరణ మార్పుల కారణంగా అక్టోబర్ 24వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం తీర ప్రాంతాలపై ఎంతవరకు ఉంటుందనేది అల్పపీడనం బలపడే తీరుపై ఆధారపడి ఉంటుంది.
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నేడు (శుక్రవారం) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈశాన్య రుతుపవనాల రాకతో దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సాధారణంగా వర్షపాతం అందుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే హెచ్చరికలను గమనించాలని సూచించారు.