వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన

పట్టణంలోని ఒక పాఠశాలలో పేద విద్యార్థులకు మంజూరైన నిధులను స్కూలు యాజమాన్యం పక్కదారి పట్టించడం పట్ల నిరసన వ్యక్తం.

Update: 2019-12-02 09:21 GMT
ఎమ్మార్పీఎస్ నాయకుడు జయరాజ్

కంభం: పట్టణంలోని ఒక పాఠశాలలో పేద విద్యార్థులకు మంజూరైన నిధులను స్కూలు యాజమాన్యం పక్కదారి పట్టించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకుడు జయరాజ్ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని స్పందన కార్యక్రమంలో మరియు పలు ఉన్నత అధికారులకు కలిసి ఫిర్యాదు చేసిన సమస్యలు పరిష్కరించ లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.

తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. విషయం తెలుసుకున్న ఎస్సై మాధవరావు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సీఐ రాఘవేంద్ర రావు ఎస్సై మాధవరావు సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించి వాటర్ ట్యాంకు పైనుండి జయరాజ్ కిందకు దిగాడు.

Tags:    

Similar News