Papi Kondalu: అద్భుత దృశ్యం.. మద్దిచెట్టు నుంచి ఉబికివస్తున్న నీరు

Papi Kondalu: సాధారణంగా అక్కడక్కడ భూమిలో నుంచి నీరు పైకి ఉబికి రావడం చూస్తుంటాం.. కానీ ఓ చెట్టు నుంచి నీరు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.

Update: 2024-03-30 14:00 GMT

Papi Kondalu: న‌ల్ల‌మ‌ద్ది చెట్టు నుంచి ఉప్పొంగిన నీళ్లు..

Papi Kondalu: సాధారణంగా అక్కడక్కడ భూమిలో నుంచి నీరు పైకి ఉబికి రావడం చూస్తుంటాం.. కానీ ఓ చెట్టు నుంచి నీరు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి సంఘటన అల్లూరి జిల్లా పాపికొండల అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది. దేవీపట్నంలోని అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు అటవీ శాఖ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలోనే నల్లమద్ది చెట్టు వద్దకు వచ్చిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ చెట్టు నుంచి నీటి చుక్కలు బయటకు రావడం చూసిన వారు చెట్టు బెరడును నరకగా.. అక్కడి నుంచి నీటి ధార రావడం కనిపించింది. 40 ఏండ్ల వయస్సు ఉన్న నల్లమద్ది చెట్లు జలధారా వృక్షాలుగా మారుతాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News