విపత్తులను ఎదుర్కోవడానికి ముందస్తు సన్నాహాలు: విజయనగరం జిల్లా కలెక్టర్

Update: 2020-06-20 11:15 GMT

విజయనగరం: వచ్చే జూలై నుండి అక్టోబర్ వరకు వరదలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం అధికంగా ఉంటుందని అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు సన్నద్ధత తో తమ శాఖల ద్వారా విపత్తుల నష్టాలు తగ్గించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్ ఆదేశించారు. విపత్తుల సన్నద్ధతపై జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆయా ప్రభుత్వ శాఖల సన్నద్ధత పై సమీక్షించడంతో పాటు విపత్తులను ఎదుర్కొనేందుకు శాఖల వారీగా మార్గనిర్దేశం చేశారు.

విపత్తుల సమయంలో అత్యవసరమైన యంత్ర పరికరాల కొనుగోలు కోసం అవసరమైన నిధులు రోడ్లు భవనాలు శాఖకు మంజూరు చేస్తామని చెప్పారు. పట్టణాల్లో విపత్తుల కోసం ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేయాల్సి ఉంటుందని మునిసిపల్ కమీషనర్ వర్మకు సూచించారు. జిల్లాలో కొత్తగా నియమితులైన గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు విపత్తులను ఎదుర్కోవడంలో తగిన శిక్షణ ఇవ్వాల్సి వుందని, అందుకు రెవిన్యూ శాఖ ద్వారా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారికి సూచించారు.

తుఫానులను ఎదుర్కొనేందుకు వీలుగా సముద్ర తీర గ్రామాల్లో రెండు నెలలకు సరిపడే రేషన్ ను ఆయా గ్రామాల్లో సిద్ధంగా ఉంచాలని జిల్లా పౌరసరఫరాల అధికారికి సూచించారు. తుఫానులు వచ్చేటపుడు ఏ ప్రాంతాల్లో ఏ రకమైన నష్టం జరుగుతుంది, నాగావళి వరదల వల్ల ఏయే ప్రాంతాలకు అధికంగా ముప్పు ఉంటుందనే అంశంలో ఆయా శాఖల అధికారులకు తగిన అవగాహన అవసరమని పేర్కొన్నారు.  

Tags:    

Similar News