Cyclone Montha: మొంథా తుపానును ఎదుర్కోడానికి సిద్ధం: కలెక్టర్
Cyclone Montha: మొంథా తుఫానును ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ తెలిపారు.
Cyclone Montha: మొంథా తుఫానును ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేసినట్లు తెలిపారు. మొంథా తుఫాను కాకినాడ దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు.
ADVERTISEMENT
ఈ నేపథ్యంలో వరుసగా 3 రోజులపాటు భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ యంత్రాంగానికి ప్రజలు తమవంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. జిల్లాలో తుఫాను ప్రభావం పడే అవకాశం ఉన్న 69 గ్రామాలను ముందే గుర్తించామని అక్కడి యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.