CII Summit Visakhapatnam: విశా‌ఖ సీఐఐ సమ్మిట్ నిర్వహణకు సర్వం సిద్ధం

CII Summit Visakhapatnam: విశాఖలో భాగ‌స్వామ్య స‌ద‌స్సు నిర్వహించేందుకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతుంది.

Update: 2025-11-12 06:16 GMT

CII Summit Visakhapatnam: విశా‌ఖ సీఐఐ సమ్మిట్ నిర్వహణకు సర్వం సిద్ధం

CII Summit Visakhapatnam: విశాఖలో భాగ‌స్వామ్య స‌ద‌స్సు నిర్వహించేందుకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతుంది. 48 దేశ‎, విదేశీ ప్రతినిధులు, 800 మందికి పైగా పారిశ్రామిక వేత్తలు హాజరుకాబోతున్న ఈ సదస్సు ఆంధ్రాకి ఎకానమీ హబ్‌గా మారబోతోంది. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌గా మారిన సీఐఐ సమ్మిట్‌పై స్పెషల్ రిపోర్ట్..

ఈనెల 14, 15వ తేదీల్లో విశాఖ‌ వేదిక‌గా భాగ‌స్వామ్య స‌ద‌స్సు జరగనుంది. ఈ సదస్సుని దిగ్విజయం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం, అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. దాదాపు 48 దేశాల నుంచి వందల సంఖ్యలో అతిథులు, వివిధ కంపెనీల ప్రతినిధులు రానున్నారు. సదస్సు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి 9కోట్ల 8 లక్షల పెట్బుబడులు రానున్నాయి. తద్వారా ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

దేశ‌, విదేశాల నుంచి వ‌చ్చే పారిశ్రామిక వేత్తలు, రాజ‌కీయ‌, అధికార ప్రముఖుల స‌మ‌క్షంలో 410 ఒప్పందాలు జ‌రుగనున్నాయని సీఐఐ మెంబర్ సాంబశివరావు తెలిపారు.

2 కోట్ల 7 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులు శంకుస్థాపనలు జరుగుతాయని జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సు విశాఖతో పాటు ఏపీ ఆర్థిక ప్రగతికి దోహదపడుతోందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు భాగస్వామ్య సదస్సుని అత్యంత ప్రెస్టేజ్‌గా నిర్వహించాలనే ఆదేశాలతో విశాఖ నగర సుందరీకరణ పనులు చేపట్టారు. విద్యుత్ అలంకరణ, రోడ్ల మరమత్తులు, గ్రీనరీ ల్యాండ్స్, ట్రాఫిక్ కూడళ్లలో ల్యాండ్ మార్క్‌లు తీర్చిదిద్దుతున్నారు. అతిథుల కోసం సిటీలో ఉన్న అన్ని హోటల్స్ ఇప్పటికే బుక్ చేశారు. ముఖ్యంగా క్లీన్ సిటీగా విశాఖను ఆవిష్కరించబోతున్నారు అధికారులు. ట్రాఫిక్ మేనెజ్మెంట్‌తో పాటు భద్రత చర్యలు పెంచారు. వెహికల్ పార్కింగ్ జోన్స్, ఇమ్మిగ్రేషన్, పోలీస్ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారు.

మొత్తానికి మరోసారి విశాఖ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకి వేదిక అవడంతో అందరి చూపు విశాఖ వైపు మళ్ళింది.

Tags:    

Similar News