Vinayaka Chavithi festival celebrations in Kanipakam: కాణిపాకంలో ప్రారంభమైన చవితి వేడుకలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇళ్ల వద్దనే వినాయక చవితి
Vinayaka Chavithi festival celebrations in Kanipakam: ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది
KANIPAKAM
Vinayaka Chavithi festival celebrations in Kanipakam: ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితిని ఇళ్లలోనే జరిపేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో వీధుల్లో వినాయక పందిళ్లకు స్వస్తి చెప్పారు. ఇదేకాకుండా వీటికి సంబంధించి పత్రి, ప్రతిమల అమ్మకాల్లో ఎటువంటి హడావిడి లేకుండా భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు చేసేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. గత వరలక్ష్మి వ్రతంలో అందరూ సమూహికంగా వందల్లో ప్రజలు తరలివచ్చి కొనుగోళ్లు చేయడంతో దీని ప్రభావం వైరష్ వ్యాప్తిపై పడి, పాజిటివ్ లు పెరిగేందుకు దోహదపడటంతో ముందస్తుగా ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని క్షేత్రంలో చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితితో మొదలై వచ్చే నెల 11 వరకు 21 రోజుల పాటు కాణిపాకం బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించేలా చర్యలు చేపట్టారు. ప్రతిరోజు స్వామివారికి పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామోత్సవంను నిలిపివేసి ఆలయ ప్రాకారంలోని వాహన సేవలు నిర్వహించనున్నారు. వినాయక చవితి రోజు మూడు వేల నుండి నాలుగు వేల మందికి మాత్రం దర్శన భాగ్యం కల్పించనున్నారు. 60 ఏళ్ళు పైబడి 10 సంవత్సరాలలోపు ఉన్న చిన్న పిల్లలకు దర్శన భాగ్యం లేదని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో దర్శనం టికెట్లు విక్రయించేలా చర్యలు చేపట్టారు.