వాష్ రూమ్ కి వెళ్లారని ఇద్దరు విద్యార్థినీలను కరెంటు వైరుతో కొట్టిన వైస్ ప్రిన్సిపాల్
ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విస్సన్నపేటలోని వికాస్ కాలేజీలో ఇద్దరు విద్యార్థినిలు వాష్ రూమ్‌కి వెళ్లారన్న నెపంతో..
ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విస్సన్నపేటలోని వికాస్ కాలేజీలో ఇద్దరు విద్యార్థినిలు వాష్ రూమ్‌కి వెళ్లారన్న నెపంతో.. వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి వారిని దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో విద్యార్థినిలు స్పృహ కోల్పోయారు. విషయం బయటకు రాకుండా వారికి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడ్డ విద్యార్థినిలు తల్లిదండ్రులు స్కూల్లో జరిగిన విషయాన్ని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని నిలదీయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.