టీడీపీ ఎంపీ కేశినేని నాని పై కేసు నమోదు

టీడీపీ ఎంపీ కేశినేని నాని పై కేసు నమోదు అయింది. విజయవాడ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

Update: 2020-05-03 07:44 GMT
Kesineni Nani (File Photo)

టీడీపీ ఎంపీ కేశినేని నాని పై కేసు నమోదు అయింది. విజయవాడ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించాని, అందుకే పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను విడుదల చేసారు.

"ఈ నెల 1వ తేదీన ఉదయం విజయవాడ నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 47వ డివిజన్‌లోని గుజ్జారి యల్లారావు కూరగాయల మార్కెట్ సముదాయం ఎదురుగా టీడీపీకి చెందిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, నాగుల మీరా, నాగోతి రామారావు, గుర్రం కొండా, పోతినేడి లోకేష్, కూరాకుల మల్లేశ్వరరావు సహా పలువురు ప్రభుత్వ లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా కనీస సామాజిక దూరం పాటించకుండా పెద్ద ఎత్తున్న ప్రజలను జమచేసి ప్రాణాంతక కరోనా వ్యాధి వ్యాప్తి చెందే విధంగా ప్రవర్తించి కూరగాయల పంపిణీ చేశారని ఏసీపీ పేర్కొన్నారు. కాబట్టి, ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి కరోనా వ్యాప్తి చెందేందుకు కారణమైన వారందరిపై విజయవాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నుందు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు."

అయితే దీనిపైన టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. "కరోనా విపత్తు లో తిండి లేక అలమటిస్తున్న పేదలకు సహాయం చేస్తునందుకు దొంగ కేసులు బనాయించిన విజయవాడ సిటీ పోలీసులకి వారికి ధన్యవాదాలు మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా భయపడేది లేదు. ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవడం ఆపేది లేదు. ప్రజలు ఎన్నుకొన్నది వారు ఆపదలో వున్నపుడు ఇంట్లో కూర్చోవడానికి కాదు. దొంగ కేసులకు భయపడి పేదలకు ఆపదలో వున్న వారికి సేవ చేయడం మానేస్తా అని అనుకుంటున్నారా? ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తా ఎన్ని దొంగ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. " అంటూ పేర్కొన్నారు.







Tags:    

Similar News