ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగాలంటూ విజయవాడలో భారీ ర్యాలీ

ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగాలంటూ విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు వైసీపీ నేతలు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.

Update: 2020-01-19 07:11 GMT

ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగాలంటూ విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు వైసీపీ నేతలు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. అభివృద్ధి అంతా ఒక్క అమరావతిలోని కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్లకార్డులు పట్టుకొని 'బిఆర్ టిఎస్' రోడ్ నుంచి మధురానగర్ వరకు ర్యాలీ చేశారు. ముందుగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ యార్లగడ్డ వెంకటరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను , పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమరావతిలో చంద్రబాబు బినామీ భూముల కోసమే రైతుల చేత నిరసన దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మోసాలను అరికట్టేందుకే ఈ ర్యాలీ చేపట్టామని మంత్రి తెలిపారు. ముఖ్యమంతి వైస్‌ జగన్‌ నిర్ణయాలను విజయవాడ ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. రాజధాని విషయంలో ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు వేలాది మంది ప్రజలు, మహిళలు రోడ్ల మీదకు వచ్చారని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాయకీయ భిక్షగాడని వ్యాఖ్యానించారు. మూడు ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్ద్యేశ్యం అని అన్నారు. విజయవాడ సమగ్రాభివృద్ధే సీఎం వైఎస్‌ జగన్‌ ధ్యేయమన్నారు.

చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనా కాలంలో దుర్గా వారధిని కట్టకుండా మోసం చేశారని విమర్శించారు. బాబు ట్రాప్‌లో పడొద్దని ప్రజలకు సూచించారు. లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ విజయవాడలోనే ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సుజనాచౌదరి వంటి వారి మాటలు కూడా నమ్మొద్దని ఆయన అన్నారు. అధికార వికేంద్రీకరణ తోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చెయ్యాలన్న కారణంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. జగన్ నిర్ణయానికి అన్ని ప్రాంతాల ప్రజలు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. 

Tags:    

Similar News