ఐదవ రోజుకు చేరుకున్న దసరా మహోత్సవాలు.. మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ

Kanaka Durga Temple: విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Update: 2025-09-26 06:16 GMT

Kanaka Durga Temple: విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమయింది. దేవి నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

జగన్మాత ఈ అవతారంలో దుష్టసంహారం చేసి లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. 8 రూపాల్లో కొలువై అష్టలక్ష్ములుగా మహాలక్ష్మీ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News