ఏపీ హోంమంత్రికి దివ్య తల్లిదండ్రుల లేఖ!

Vijayawada Divya Case : విజయవాడలో ఉన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఏపీ హోంశాఖ మంత్రి సుచరితకు లేఖ రాశారు. తమ పాపకు జరిగిన అన్యాయం.. మరి ఏ ఆడబిడ్డకు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Update: 2020-10-17 13:41 GMT

Divya Case : విజయవాడలో ఉన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఏపీ హోంశాఖ మంత్రి సుచరితకు లేఖ రాశారు. తమ పాపకు జరిగిన అన్యాయం.. మరి ఏ ఆడబిడ్డకు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తమ బిడ్డను దారుణంగా చంపిన.. ఆ ఉన్మాదికి విధించే శక్ష రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇంకొకసారి ఎవరైనా ఆడపిల్లల విషయంలో ఇలా చేయాలంటే.. భయపడే విధంగా శిక్షను విధించాలన్నారు. క్రీస్తురాజపురంలో చాలా మంది గుట్కా, గంజాయి, తాగుడుకు బానిసై ఉన్మాదుల్లా మారుతున్నారని వారు ఈ లేఖలో తెలిపారు.

అటు దివ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. లాక్ డౌన్ టైంలో దివ్యను తాను మంగళగిరిలో పెళ్లి చేసుకున్నట్లుగా నిందితుడు నాగేంద్ర పోలీసులకు తెలిపాడు. దివ్య తండ్రికి తనకు ఘర్షణ జరిగిందని తనను ఇష్టానుసారం దూషించినట్లు నాగేంద్ర తెలిపాడు. దివ్య నుంచి దూరంగా ఉండాలంటూ వార్నింగ్ ఇవ్వడంతో నాగేంద్ర, దివ్య ఇంటికి వెళ్లి ఆమెతో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లిన సమయంలో వెంట ఎలాంటి ఆయుధాలు తీసుకెళ్ల లేదని దివ్య ఇంట్లో కత్తినే వినియోగించినట్లు నాగేంద్ర చెబుతున్నాడు. మరోవైపు దివ్య ఇంట్లో ఫ్యాన్ కు చీర వేళ్లాడుతుండటం బట్టి దివ్య ఆత్మహత్యకు ప్రయత్నించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అటు మరోవైపు దివ్య నాగేంద్రతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగులు, దివ్య రికార్డు చేసుకున్న ఓ ఇన్ స్టా గ్రామ్ వీడియో ఒకటి బయటకు వచ్చాయి. ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News